IPL playoffs 2020 : ప్లేఆఫ్‌ రేసులో… సన్ రైజర్స్‌కి అవకాశముందా?

  • Published By: sreehari ,Published On : October 29, 2020 / 04:22 PM IST
IPL playoffs 2020 :  ప్లేఆఫ్‌ రేసులో… సన్ రైజర్స్‌కి అవకాశముందా?

IPL playoffs 2020 : ఐపీఎల్ 2020 సీజన్‌లో ఎనిమిది జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

ఒక్కో జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.

ఫ్లే ఆఫ్ రేసులో పోటీపడుతున్న 8 ఐపీఎల్ జట్లలో దాదాపు చెన్నై సూపర్ కింగ్స్ అవకాశం కోల్పోయినట్టే కనిపిస్తోంది.



ఇక మిగిలిన 7 ఐపీఎల్ జట్లలో ఏ నాలుగు జట్లు ఫ్లే ఆఫ్ లో చోటు దక్కించుకుంటాయో చూడాలి.

మొన్న సోమవారం KKR vs KXIP మ్యాచ్ లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో విజయంతో పంజాబ్ ఖాతాలో మొత్తంగా 12 పాయింట్లు చేరాయి. దీంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

మొదటి మూడు స్థానాల్లో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోస్థానంలో, మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతున్నాయి. ప్రతి ఐపీఎల్ జట్టులో ఏదైనా జట్టు గరిష్టంగా 20 పాయింట్లను పొందవచ్చు.



అయితే మూడు జట్లలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు మాత్రమే ఈ గణాంకాలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇందులో ఏ ఒక్క జట్టు అయిన 20 పాయింట్లు పొందితే.. ఇతర రెండు జట్లు ఫ్లే ఆఫ్ కు అర్హత కోల్పోతాయి. ఈ మూడు జట్లు కాకుండా మరో ఇతర ఏ జట్టు 16 పాయింట్లను దాటలేదు.

ఎందుకంటే.. కోల్ కతా, పంజాబ్ మాత్రమే ఈ పాయింట్లను చేరే అవకాశం ఉంది. ఫ్లే ఆఫ్‌ అర్హత పొందాలంటే ఇంకా 10 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

అంటే.. మొత్తం మ్యాచ్‌ల కలయికతో 1,024 ఫలితాలు (మ్యాచ్ రద్దు కాకుండా) ఉన్నాయి. ఫ్లే ఆఫ్ రేసులో చెన్నై జట్టు మాత్రమే అవకాశాలు కోల్పోయినట్టు కనిపిస్తోంది.



ఇక రాజస్థాన్ జట్టు మిగిలిన తమ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఫ్లే ఆఫ్ కు అర్హత పొందే అవకాశం ఉంది.

కానీ, ఒకవేళ రాజస్థాన్ రెండు మ్యాచ్ లు గెలిచినప్పటికీ కేవలం 3 శాతం మాత్రమే పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో (1024 ఫలితాల్లో 32 పాయింట్లతో మాత్రమే) నిలిచే అవకాశం ఉంది.



సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఫ్లే ఆఫ్ అర్హతకు అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. ఆడబోయే మూడు మ్యాచ్ ల్లో తప్పక గెలవాల్సి ఉంది.

వీటిలో గెలిచినప్పటికీ కూడా 7 శాతం మాత్రమే నాల్గో స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మాత్రం 95 శాతం ఫ్లే ఆఫ్ కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఈ జట్లలో ఎవరైనా అర్హత సాధించలేకపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.

ఉమ్మడిగా నాల్గవ స్థానానికి కేవలం 0.8% మాత్రమే చేయలేరు. నాల్గవ స్థానానికి చేరుకునే సంభావ్యత 4.7శాతంగా ఉండాలి.



కోల్ కతా, పంజాబ్ మాత్రమే నాల్గో స్థానంలో పోటీపడే అవకాశం ఉంది. ఈ రెండు జట్లలో కోల్ కతా లేదా పంజాబ్ ఏదైనా ఒక జట్టు నెంబర్ వన్ స్థానంలో స్పష్టంగా ఉండకపోవచ్చు.

కానీ, ఈ జట్లలో (0.8%) ఉమ్మడిగా మొదటి స్థానానికి చేరుకునేందుకు కొంత అవకాశం ఉంది.