ధోనీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పేయనున్నాడా..?

ధోనీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పేయనున్నాడా..?

MS Dhoni రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు తన చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మరోసారి అదే జట్టు జెర్సీని పాండ్యా బ్రదర్స్ హార్దిక్, కృనాల్ కు గిఫ్ట్ ఇచ్చాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం తర్వాత పాండ్యా బ్రదర్స్ ఆ జెర్సీతో ఫొటో దిగారు. ధోనీ చేసిన పనికి అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది.

ఆగష్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేసిన ధోనీ.. కొద్ది రోజుల విరామంతోనే ఐపీఎల్ 2020 సీజన్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఘటనతోనే షాక్ ఎదుర్కొన్న అభిమానులు టెస్టు ఫార్మాట్ రిటైర్మెంట్ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ రాంచీ క్రికెటర్ లైఫ్ లో తీసుకునే ప్రతి పెద్ద నిర్ణయానికి ఏదో ఒక హిట్ ఇస్తూనే ఉంటాడు.



టాప్ లెవల్ క్రికెటింగ్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్ కు స్వతహాగా ధోనీ పార్టిసిపేట్ చేశాడు. అయితే ధోనీ చేస్తున్న పనులను బట్టి సీఎస్కే జెర్సీకి కూడా ధోనీ గుడ్ బై చెప్పేయనున్నాడా అని అందరిలో ప్రశ్న మొదలైంది.

ఈ సీజన్లో ధోనీ బ్యాట్ తో ఆశించినంత మేర ప్రదర్శన చేయలేకపోయాడు. అతని కెప్టెన్సీ నిర్ణయాలపైనా అనుమానాలు మొదలయ్యాయి. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ పరాభవంతో ప్లే ఆఫ్ ఆశలు వదిలేసుకున్నట్లు అయింది. ఈ సీజన్ లో మిగిలిన మూడు మ్యాచ్ లలో చక్కటి పర్‌ఫార్మెన్స్ ఇస్తే.. రాబోయే సీజన్ ఆడిషన్ లో మెరుగైన రేటు వస్తుందని మిగతా ప్లేయర్లు అంచనా వేస్తున్నారు.

రాబోయే సీజన్ వేలంలో వేదికలను బట్టి ప్లేయర్లను తీసుకోవాలి. దానికి తగ్గట్లు జట్టు ప్లేయర్ల పర్‌ఫార్మెన్స్ ఉంటేనే జట్టులో ఉంటారు. ఈ మూడు గేమ్స్ తర్వాతి సీజన్ కు మంచి ప్రిపరేషన్ లాంటివి. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగలిగిన వారిని, ఒత్తిడిలోనూ కూల్ గా బ్యాటింగ్ చేయగలిగిన వారిని మాత్రమే ఎంచుకుంటాం’ అని చెప్పారు.