DC vs RCB IPL 2020: టాస్ గెలిచిన ఢిల్లీ.. బెంగళూరు బ్యాటింగ్!

  • Published By: vamsi ,Published On : November 2, 2020 / 07:17 PM IST
DC vs RCB IPL 2020: టాస్ గెలిచిన ఢిల్లీ.. బెంగళూరు బ్యాటింగ్!

Ipl2020లో భాగంగా జరుగుతున్న 55వ మ్యాచ్‌లో బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు.. బౌలింగ్ ఎంచుకుని బెంగళూరును బ్యాటింగ్‌కి ఆహ్వానించింది.



పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచే జట్టుకు ఫైనల్‌‌ చేరేందుకు రెండు అవకాశాలు వస్తాయి. ఈ క్రమంలో ఈ సీజన్‌‌లో టాప్‌‌-2 ప్లేస్‌‌ కోసం ఈ కీలక మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌, రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు పోరాటం చేస్తున్నాయి.



గెలిచిన టీమ్‌‌ సెకండ్‌‌ ప్లేస్‌‌ను దక్కించుకుంటే, ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్‌‌ కష్టమవుతుంది. మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ గందరగోళాన్ని తప్పించుకునేందుకు ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు:
Delhi Capitals (Playing XI): Shikhar Dhawan, Prithvi Shaw, Ajinkya Rahane, Shreyas Iyer(c), Rishabh Pant(w), Marcus Stoinis, Daniel Sams, Axar Patel, Ravichandran Ashwin, Kagiso Rabada, Anrich Nortje

Royal Challengers Bangalore (Playing XI): Josh Philippe, Devdutt Padikkal, Virat Kohli(c), AB de Villiers(w), Shivam Dube, Washington Sundar, Shahbaz Ahmed, Chris Morris, Isuru Udana, Mohammed Siraj, Yuzvendra Chahal