IPL 2020 MI vs KKR Live: కోల్‌కత్తాపై ముంబై ఘన విజయం

  • Published By: vamsi ,Published On : October 16, 2020 / 06:56 PM IST
IPL 2020 MI vs KKR Live: కోల్‌కత్తాపై ముంబై ఘన విజయం

[svt-event title=”8వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం” date=”16/10/2020,10:45PM” class=”svt-cd-green” ] కోల్‌కత్తాపై ముంబై ఘన విజయం సాధించిది. 16.5ఓవర్లలో 149పరుగులు చేసి 8వికెట్ల తేడాతో ముంబై కోల్‌కత్తాపై విజయం సాధించగా.. కీపర్ డీకాక్.. 44బంతుల్లో 78పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. [/svt-event]

[svt-event title=”ఓపెనింగ్ అదిరింది.. ముంబై స్కోరు 51/0″ date=”16/10/2020,9:59PM” class=”svt-cd-green” ] టాప్‌‌ క్లాస్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌‌, డెత్‌‌ బౌలింగ్‌‌ స్పెషలిస్ట్‌‌లతో ముంబై ఇండియన్స్ బలంగా ఉన్న ముంబై కోల్‌కత్తాపై బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతుంది. ముంబయి ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పవర్ ప్లే లోనే దూకుడు మొదలుపెట్టాడు. కెప్టెన్‌కు డికాక్ తోడవడంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి స్కోరు పరుగులు పెట్టింది. ప్రస్తుతం మంబయి స్కోరు వికెట్ నష్టపోకుండా 51పరుగులకు చేరింది. రోహిత్‌(20), డికాక్‌ (31) క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”కుమ్మేసిన కమ్మిన్స్.. కోల్‌కతా స్కోరు 148/5″ date=”16/10/2020,9:36PM” class=”svt-cd-green” ] కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148పరుగులు చేసింది. కమ్మిన్స్ 53పరుగులు చేసి కోల్‌కత్తా స్కోరును గౌరవప్రదమైన స్థానంలో పెట్టాడు. కెప్టెన్ మోర్గాన్ 31 పరుగులతో కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడడంతో.. 63పరుగులకే 5వికెట్లు కోల్పోయి కూడా మంచి స్కోరు చేసింది.

టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం అవగా.. కమ్మిన్స్ కోల్‌కత్తాను కాపాడాడు. త్రిపాఠి 7, నితీష్ రానా 5, దినేష్ కార్తీక్ 4 పరుగులే చేయగా.. గిల్ మాత్రమే 21పరుగులు చేశాడు. 11 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కమ్మిన్స్ జోడి అద్భుతంగా ఆడి 87 పరుగులు చేశారు. కౌల్టర్‌నైల్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది కమిన్స్‌ 35 బంతుల్లో అర్ధశతకం సాధించగా.. మోర్గాన్‌ రెండు సిక్సర్లు‌ బాదడంతో ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. [/svt-event]

[svt-event title=”రాణిస్తున్న కమ్మిన్స్.. కోల్‌కత్తా స్కోరు 99/5(16.0)” date=”16/10/2020,9:00PM” class=”svt-cd-green” ] ముంబైతో మ్యాచ్‌లో 63పరుగులకే 5వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా జట్టును ఆదుకునేలా స్కోరు చేస్తున్నాడు బౌలర్ పాట్ కమ్మిన్స్.. మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27బంతుల్లో 35పరుగులు చేసి వికెట్ కాపాడుకుంటూ.. మోర్గాన్‌కు సాయంగా స్కోరు బోర్డును వంద పరుగులు దాటించాడు. [/svt-event]

[svt-event title=”కెప్టెన్ మోర్గాన్‌పైనే భారం.. కష్టాల్లో కోల్‌కత్తా: స్కోరు 61/5″ date=”16/10/2020,8:38PM” class=”svt-cd-green” ] ముంబైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా జట్టు కీలకమైన 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. ఏడు పరుగులు చేసి బౌల్ట్‌ బౌలింగ్‌లో పాయింట్‌ దిశగా షాట్‌కు ప్రయత్నించి ఫస్ట్ వికెట్‌గా త్రిపాఠి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ మెరుపు వేగంతో గాల్లోకి ఎగిరి బంతిని అద్భుతంగా పట్టుకున్నాడు. ఇది లీగ్‌లో బౌల్ట్‌కు 50వ వికెట్‌ కాగా.. రెండవ వికెట్‌గా రానా 5పరుగులు చేసి కౌల్టర్‌నైల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ డికాక్‌ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

మూడవ వికెట్‌గా గిల్‌.. రాహుల్ చాహర్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వెంటనే చాహర్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి దినేశ్‌ కార్తీక్ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

ఐదవ వికెట్‌గా బుమ్రా వేసిన షార్ట్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమై రస్సెల్ 9బంతుల్లో 12పరుగులు చేసి వికెట్‌కీపర్‌ డికాక్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ భారం మొత్తం కెప్టెన్ మోర్గాన్‌పై పడింది. మోర్గాన్‌కు తోడుగా ప్రస్తుతం క్రీజులో పాట్ కమ్మిన్స్ ఉన్నారు. కోల్‌కత్తా స్కోరు 5వికెట్ల నష్టానికి 61పరుగులుగా ఉంది. [/svt-event]

[svt-event title=”Kolkata Knight Riders (Playing XI):” date=”16/10/2020,7:25PM” class=”svt-cd-green” ] రాహుల్ త్రిపాఠి, శుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్(C), దినేష్ కార్తీక్(WK), ఆండ్రీ రస్సెల్, క్రిస్ గ్రీన్, పాట్ కమ్మిన్స్, శివం మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ [/svt-event]

[svt-event title=”Mumbai Indians (Playing XI):” date=”16/10/2020,7:23PM” class=”svt-cd-green” ] రోహిత్ శర్మ(C), క్వింటన్ డి కాక్ (WK), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా [/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్.. ముంబై బౌలింగ్!” date=”16/10/2020,7:12PM” class=”svt-cd-green” ] అబుదాబి వేదికగా భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్‌‌కతా, ముంబై జట్ల మధ్య జరిగే పోరులో టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్.. బ్యాటింగ్ ఎంచుకుని ముంబైని బౌలింగ్‌కి ఆహ్వానించింది. [/svt-event]

[svt-event title=”ఆసక్తికర పోరులో ఆడేదెవరు? నెగ్గేదెవరు?” date=”16/10/2020,7:01PM” class=”svt-cd-green” ] ఐపిఎల్ 2020లో 13వ సీజన్‌లో మరో ఆసక్తి పోరుకు రంగం సిద్ధం అయ్యింది. 32 వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈ రోజు(16 అక్టోబర్ 2020) రాత్రి 7:30గంటలకు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరగబోతుంది.

ఐపీఎల్‌‌ 2020 పాయింట్స్‌‌ టేబుల్‌‌లో ప్రస్తుతం టాప్‌‌ -4లో ఈ రెండు జట్లు సీజన్‌‌లో రెండోసారి తలపడబోతున్నాయి. అబుదాబిలోని షేక్​ జాయెద్​ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌‌లో ముంబై కోల్‌కత్తాపై విజయం సాధించేందుకు గట్టి పట్టుదలగా ఉంది. మరోపక్క బెంగళూరు చేతిలో 82 రన్స్‌‌ తేడాతో చిత్తుగా ఓడిన కోల్‌‌కతా.. ఈ మ్యాచ్‌లో గెలుస్తుందా? ఈ మ్యాచ్‌లో ఆడే ఆటగాళ్లెవరు? నెగ్గేదెవరు? [/svt-event]