RCB vs KXIP IPL 2020: బెంగళూరుపై 8వికెట్ల తేడాతో పంజాబ్ విజయం

  • Published By: vamsi ,Published On : October 15, 2020 / 06:07 PM IST
RCB vs KXIP IPL 2020:  బెంగళూరుపై 8వికెట్ల తేడాతో పంజాబ్ విజయం

KL Rahul captain of Kings XI Punjab made century and celebrating during match 6 of season 13, Dream 11 Indian Premier League (IPL) between Kings XI Punjab and Royal Challengers Bangalore held at the Dubai International Cricket Stadium, Dubai in the United Arab Emirates on the 24th September 2020. (Photo: BCCI/IPL)

[svt-event title=”బెంగళూరుపై 8వికెట్ల తేడాతో పంజాబ్ విజయం” date=”15/10/2020,11:06PM” class=”svt-cd-green” ] బెంగళూరుపై 8వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్‌ని పంజాబ్‌ రెండు వికెట్లు కోల్పోయి 20ఓవర్లలో ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌(61), క్రిస్‌గేల్‌(53) అర్ధ శతకాలతో రాణించగా.. చివరి బంతికి ఒక్క పరుగు మాత్రమే రావల్సిన ఉత్కంఠ పోరులో పూరన్ సిక్సర్‌తో విజయాన్ని అందించాడు. [/svt-event]

[svt-event title=”క్రిస్ గేల్ రనౌట్..” date=”15/10/2020,11:01PM” class=”svt-cd-green” ] పంజాబ్, బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు రెండవ వికెట్ కోల్పోయింది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రన్ అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”తన తొలి మ్యాచ్‌లో 50పరుగులు చేసిన గేల్.. పంజాబ్ స్కోరు 162/1″ date=”15/10/2020,10:52PM” class=”svt-cd-green” ] ఏడు మ్యాచ్‌ల ఫస్ట్ స్పెల్ ముగిసిన తర్వాత ఐపీఎల్‌లో పంజాబ్ తరపున స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన యూనివర్సల్ బాస్ గేల్.. వరుస పరాజయాలను చవి చూస్తోన్న పంజాబ్‌కు విజయం అందించే క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ 2020లో తన తొలి మ్యాచ్‌లోనే 36బంతుల్లో 50పరుగులు పూర్తి చేశాడు గేల్. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ది బాస్ అని బ్యాట్‌లో ఉండే స్టిక్కర్‌ను చూపించాడు గేల్. [/svt-event]

[svt-event title=”రాణిస్తున్న రాహుల్.. రెచ్చిపోతున్న గేల్.. స్కోరు 146/1″ date=”15/10/2020,10:36PM” class=”svt-cd-green” ] బెంగళూరుతో మ్యాచ్లో కెప్టెన్ కేఎల్‌ రాహుల్ రాణిస్తుండగా.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన ఫస్ట్ మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. మొహమ్మద్ సిరాజ్ వేసిన 16వ ఓవర్‌లో ఇద్దరు కలిసి రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదగా.. ఆ ఓవర్‌లో 20పరుగులు లభించాయి. ఇక 24బంతుల్లో 26పరుగులు చేస్తే పంజాబ్ గెలుస్తుంది. [/svt-event]

[svt-event title=”30బంతుల్లో 46పరుగులు.. పంజాబ్ స్కోరు 126/1″ date=”15/10/2020,10:34PM” class=”svt-cd-green” ] పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తన ఫామ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. 37బంతుల్లో 50పరుగులు చేసి ఐపీఎల్ 2020లో మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నాలుగు సిక్స్‌లు ఒక ఫోర్ సాయంతో పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అర్ధశతకం సాధించాడు. నవదీప్ సైనీ వేసిన 15వ ఓవర్‌లో గేల్‌(24)తో కలిసి మూడు పరుగులు తీయగా.. ఆ జట్టు స్కోర్‌ 126/1కి చేరింది. ఇక 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి. [/svt-event]

[svt-event title=”మయాంక్ అవుట్.. క్రిస్ గేల్ ఇన్.. స్కోరు 84/1″ date=”15/10/2020,10:10PM” class=”svt-cd-green” ] బెంగళూరు నిర్దేశించిన 172పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌.. పవర్ ప్లే అయిపోయాక తొలి వికెట్‌ కోల్పోయింది. చాహల్‌ వేసిన 8వ ఓవర్లో ఓ భారీ సిక్సర్‌ బాదిన మయాంక్‌ మళ్లీ అలాగే భారీ షాట్‌ ఆడబోయి అర్ధశతకానికి ఐదు పరుగుల చేరువలో (45, 25బంతుల్లో) అవుటయ్యాడు. మయాంక్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎంట్రీ ఇచ్చాడు. 10ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి పంజాబ్ 85పరుగులు చేసింది. [/svt-event]

[svt-event title=”ఓపెనర్లు కుమ్మేశారు.. పంజాబ్ స్కోరు 56/0″ date=”15/10/2020,9:49PM” class=”svt-cd-green” ] షార్జా వేదికగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో 172పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్లు భారీ షాట్లతో పంజాబ్ స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఫస్ట్ రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడినా.. తర్వాత కుమ్మేశారు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ జట్టు వికెట్ నష్టపోకుండా 56పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ 20బంతుల్లో 25పరుగులు చెయ్యగా.. మయాంక్ అగర్వాల్ 16బంతుల్లో 30పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”పంజాబ్ టార్గెట్ 172″ date=”15/10/2020,9:12PM” class=”svt-cd-green” ] మహమ్మద్‌ షమీ వేసిన 18వ ఓవర్‌లో మూడో బంతికి డివిలియర్స్‌.. దీపక్‌ హూడా చేతికి చిక్కి అవుట్ అవగా.. ఐదో బంతికి కోహ్లీ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరు స్కోర్‌ 137/6 దగ్గర క్రీజులోకి ఇసురు ఉడాన, క్రీస్‌ మోరిస్‌ వచ్చారు.

డివిలియర్స్‌(2), విరాట్‌ కోహ్లీ(48) అవుటవగా.. ఇక పెద్దగా స్కోరు పోదు అనుకున్న సమయంలో మోరీస్, ఉడానా మెరుపులు కారణంగా.. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. మహ్మద్‌ షమి వేసిన చివరి ఓవర్‌లో క్రిస్‌ మోరిస్‌(25) రెండు సిక్సులు, ఒక ఫోర్‌ కొట్టగా ఇసురు ఉడాన(10) ఒక సిక్స్‌ బాదాడు. అలాగే రెండు సింగిల్స్‌ రావడంతో చివరి ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. దీంతో పంజాబ్ టార్గెట్ 172గా అయ్యింది.

[/svt-event]

[svt-event title=”దూకుడుగా ఆడుతున్న దూబే అవుట్.. బెంగళూరు స్కోరు 133/4″ date=”15/10/2020,8:49PM” class=”svt-cd-green” ] రవి బిష్ణోయి వేసిన 15వ ఓవర్‌లో రెండు సిక్సర్‌‌లు బాది.. దూకుడుగా పరుగులు రాబడుతున్న దూబె 19బంతుల్లో 23పరుగులు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దూబె అవుట్ అయ్యాక క్రీజులోకి డివిలియర్స్ వచ్చాడు. ఈ క్రమంలో 17ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 133/4కి చేరుకుంది. [/svt-event]

[svt-event title=”దూకుడుగా ఆడుతున్న దూబే.. బెంగళూరు స్కోరు 122/3″ date=”15/10/2020,8:41PM” class=”svt-cd-green” ] క్రిస్‌జోర్డాన్‌ వేసిన 14వ ఓవర్‌లో బెంగళూరు 100 పరుగులు దాటగా.. ఈ ఓవర్‌లో కోహ్లీ(36), శివమ్‌దూబె(8) ఆరు పరుగులు తీశారు. దీంతో జట్టు స్కోర్‌ 103/3కి పెరిగింది.. తర్వాత టైమ్ అవుట్ తర్వాత రవి బిష్ణోయి వేసిన 15వ ఓవర్‌లో దూబె‌(21) రెండు సింగిల్స్‌తో పాటు రెండు సిక్సర్‌ బాదాడు. కోహ్లీ‌(40) మరో రెండు సింగిల్స్‌, ఒక రెండు పరుగులు తీశాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 15ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 122/3కి చేరుకుంది. [/svt-event]

[svt-event title=”మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు.. క్రీజులో దూబె, కోహ్లీ.. స్కోరు 103/3(14.0)” date=”15/10/2020,8:32PM” class=”svt-cd-green” ] పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు భారీ స్కోరు దిశగా సాగుతుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు ఆరోన్ ఫించ్, దేవదత్తా పాడికల్, వాషింగ్టన్ సుందర్ వికెట్లను కోల్పోయింది.

అర్షదీప్‌ వేసిన ఐదవ ఓవర్ మొదటి బంతికి పడిక్కల్ 12 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కాసేపటికే మురుగన్‌ అశ్విన్‌ వేసిన ఏడో ఓవర్‌ రెండో బంతికి బౌండరీ బాదిన ఆరోన్‌ ఫించ్‌(20) తర్వాతి బంతికే బౌల్డ్ అయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్ కోహ్లీతో కలిసి పరుగులు రాబట్టే ప్రయత్నం చేస్తూ.. జట్టు స్కోర్‌ 86పరుగులు వద్దకు చేరగానే.. మురుగన్‌ అశ్విన్‌ వేసిన పదో ఓవర్‌ మూడో బంతికి భారీ షాట్‌ ఆడబోయి క్రిస్‌జోర్డాన్‌ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. అనంతరం శివమ్‌ దూబె(8) క్రీజులోకి రాగా.. కోహ్లీ(36) ఆడుతున్నారు. 14ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్‌ 103/3కి చేరింది.

[/svt-event]

[svt-event title=”Kings XI Punjab(Playing XI):” date=”15/10/2020,7:12PM” class=”svt-cd-green” ] 1.మయాంక్ అగర్వాల్, 2 క్రిస్ గేల్, 3 KL రాహుల్ (కెప్టెన్), 4 నికోలస్ పూరన్ (WK), 5 గ్లెన్ మ్యాక్స్‌వెల్, 6 దీపక్ హుడా, 7 క్రిస్ జోర్డాన్, 8 ఎం అశ్విన్, 9 రవి బిష్ణోయ్, 10 మహ్మద్ షమీ, 11 అర్ష్‌దీప్ సింగ్ [/svt-event]

[svt-event title=”Royal Challengers Bangalore(Playing XI):” date=”15/10/2020,7:10PM” class=”svt-cd-green” ] 1.ఆరోన్ ఫించ్, 2. దేవదత్ పాడికల్, 3 విరాట్ కోహ్లీ (కెప్టెన్), 4 ఎబీ డివిలియర్స్ (WK), 5 శివం దూబే, 6 వాషింగ్టన్ సుందర్, 7 క్రిస్ మోరిస్, 8 ఇసురు ఉడనా, 9 మహ్మద్ సిరాజ్, 10 నవదీప్ సైని, 11 యుజ్వేంద్ర చాహల్ [/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన బెంగళూరు.. పంజాబ్ ఫీల్డింగ్” date=”15/10/2020,7:05PM” class=”svt-cd-green” ] షార్జా (Sharjah Cricket Stadium) వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. [/svt-event]

[svt-event title=”Probable XI:” date=”15/10/2020,6:41PM” class=”svt-cd-green” ]

Royal Challengers Bangalore: దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (సి), డివిలియర్స్(WK), శివం దూబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉడాన, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, మొహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Kings XI Punjab: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్(C), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్(WK), గ్లెన్ మ్యాక్స్‌వెల్/జేమ్స్ నీషామ్, మన్‌దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్/ గౌతమ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ [/svt-event]

[svt-event title=”రాహుల్ మరో సెంచరీ బాదేస్తాడా? కహ్లీ సేన కట్టడి చేస్తుందా? ” date=”15/10/2020,6:26PM” class=”svt-cd-green” ] ఈ సీజన్‌లో బెంగళూరుతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 69 బంతుల్లో 132పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రాహుల్‌ను కట్టడి చెయ్యడానికి ప్లాన్ చేస్తుంది కోహ్లీ సేన. ఫస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సేనపై మూడు వికెట్ల నష్టానికి 206పరుగులు చేసింది పంజాబ్.

[/svt-event]

[svt-event title=”బెంగళూరుపై ఘనమైన రికార్డ్.. పంజాబ్ గెలిచిన ఒక్క మ్యాచ్ కోహ్లీ సేనపైనే!” date=”15/10/2020,6:17PM” class=”svt-cd-green”] ఈ సీజన్‌లో అనూహ్యంగా బలంగా మారి రాణిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే రెండు జట్లలో ఇప్పటివరకు పైచేయి మాత్రం పంజాబ్‌దే. ఈ జట్టు ఇప్పటివరకు 25సార్లు తలపడగా.. 12సార్లు బెంగళూరు.. 13 సార్లు పంజాబ్ విజయం సాధించాయి. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై పంజాబ్ పైచేయి సాధించింది. ఈ సీజన్‌లో పంజాబ్ గెలిచిన ఏకైక మ్యాచ్ బెంగళూరు పైనే. [/svt-event]

[svt-event title=”ప్లే ఆఫ్ ఆశలు నిలుస్తాయా?” date=”15/10/2020,6:06PM” class=”svt-cd-green” ] ఒక వైపు, కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు మార్గం సుగమం చేయాలనుకుంటూ ఉంది. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం.

నేటి మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోతే, వారికి ప్లేఆఫ్ అవకాశాలు పూర్తిగా ముగిసినట్లే. ఈ సీజన్లో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7 మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలవగా.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అదే సమయంలో 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి.. బెంగళూరు మూడో స్థానంలో ఉండగా.. ఇరు జట్ల బ్యాటింగ్ బలంగా ఉంది. షార్జా మైదానంలో ఫోర్లు, సిక్సర్లు కొట్టడం ఈజీ కావడంతో స్కోరు బోర్డుపై పరుగులు గట్టిగానే పడే అవకాశం ఉంది. [/svt-event]

[svt-event title=”గేల్ గెలిపిస్తాడా? ” date=”15/10/2020,5:59PM” class=”svt-cd-green” ] కీలకమైన పోరులో పంజాబ్ జట్టుకు పెద్ద ఉపశమనం ఏమిటంటే యూనివర్సెల్ బాస్ క్రిస్ గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ అయిపోయాడు. టీ20 ఫార్మట్‌లో 10 వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకున్న క్రిస్ గేల్.. ఐపీఎల్‌లో పెద్ద పెద్ద రికార్డులు ఉన్న కరేబియన్ కింగ్.. ఈ సీజన్‌లో మాత్రం ఇప్పటివరకు క్రీజ్‌లోకి అడుగు పెట్టలేదు. తొలిసారి ఇవాళ క్రిస్ గేల్.. క్రీజ్‌లో ఆడబోతున్నాడు. ప్రస్తుతం అందరి ఫోకస్ అతని మీదే.. కీలకమైన పోరులో గేల్ గెలిపిస్తాడో లేదో చూడాలి.

[/svt-event]

[svt-event title=”కీలక పోరులో గెలిచేదెవరు?” date=”15/10/2020,5:48PM” class=”svt-cd-green” ] ఐపిఎల్‌లో ఇవాళ(15 అక్టోబర్ 2020) సాయంత్రం జరిగే 31 వ మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య షార్జాలో జరగబోతుంది. [/svt-event]