రైజర్స్‌ ప్లే ఆఫ్‌కు లైన్ క్లియర్: ముంబైతో గెలిస్తే మాత్రమే

రైజర్స్‌ ప్లే ఆఫ్‌కు లైన్ క్లియర్: ముంబైతో గెలిస్తే మాత్రమే

Playoff: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా 127పరుగుల టార్గెట్‌ను చేధించింది. ఫలితంగా టాప్ 3లో ఉన్న జట్లన్నీ ప్లేఆఫ్‌కు కన్ఫామ్ అయ్యాయి. ముంబైతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే వార్నర్ జట్టు టేబుల్ లో టాప్ కు చేరుకుంటుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ షార్జా వేదికగా ఆడనుంది.

నెట్ రన్ రేట్ పాజిటివ్ గా ఉండటంతో మ్యాచ్ గెలిస్తే నాలుగో స్థానంలోకి చేరుకోనుండగా కోల్‌కతా నిష్క్రమిస్తుంది. ఓడితే మాత్రం హైదరాబాద్‌కు ఐపీఎల్ 2020 సీజన్ ముగిసినట్లే.



జట్టును భువనేశ్వర్ కుమార్, మిచెల్ మార్ష్ గాయాలు ఇబ్బందిపెడుతున్నాయి. ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఫిట్‌నెస్‌పై సన్‌రైజర్స్ కు భయం పుట్టిస్తుంది. ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో కాలి కండరం గాయపడటంతో ఢిల్లీ మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు. అతని స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మను రీప్లేస్ చేశారు.

సాహా వచ్చి రావడంతోనే హిట్టింగ్ మొదలెట్టి జట్టును సేఫ్ గా ఉంచాడు. వార్నర్ తన ఓల్డ్ స్కూల్ టెక్నిక్స్ వాడి ఫ్రంట్ లెగ్ పై పవర్ ప్లేలో ఉతికి ఆరేస్తున్నాడు. కేన్ విలియమ్సన్, జాసన్ హోల్డర్ మిడిలార్డర్ కోసం రెడీగా ఉన్నారు. రషీద్ ఖాన్ కూడా గేమ్ ఛేంజర్ గా కనిపిస్తున్నాడు.

ముంబై విషయానికొస్తే హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చేందుకు అవకాశం దొరికింది. వెన్ను సమస్యల కారణంగా బాధపడుతున్న పాండ్యాకు కొద్ది రోజుల రెస్ట్ దొరుకుతుందన్న మాట. ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం మరికొందరు కీ ప్లేయర్లకు రెస్ట్ దొరికింది.

ఇరు జట్లు (అంచనా):

Mumbai Indians:
1 Ishan Kishan (wk)
2 Quinton de Kock/Chris Lynn
3 Suryakumar Yadav
4 Saurabh Tiwary
5 Kieron Pollard (capt)
6 Krunal Pandya
7 Nathan Coulter-Nile
8 Jayant Yadav
9 Rahul Chahar
10 Trent Boult/Mitchell McClenaghan
11 Jasprit Bumrah/Dhawal Kulkarni

Sunrisers Hyderabad:
1 David Warner (capt)
2 Wriddhiman Saha (wk)
3 Kane Williamson
4 Manish Pandey
5 Abdul Samad
6 Abhishek Sharma
7 Jason Holder
8 Rashid Khan
9 Shahbaz Nadeem/Khaleel Ahmed
10 Sandeep Sharma
11 T Natarajan

గత మ్యాచ్‌లో రైజర్స్ వర్సెస్ ఇండియన్స్
డికాక్ నుంచి హాఫ్ సెంచరీ, కీరన్ పొలార్డ్ విజృంభణ, పాండ్యా బ్రదర్స్ కలిసి 5వికెట్లు నష్టపోయి ముంబైకు 208పరుగులు నమోదుచేశారు. అదే మ్యాచ్ లో వార్నర్ మాత్రమే ఫిఫ్టీ వరకూ చేయడంతో సన్‌రైజర్స్ 34పరుగుల తేడాతో ఓడిపోయింది.
https://10tv.in/ipl-playoffs-2020-here-are-each-ipl-teams-chances-of-making-it-to-the-last-four/
స్ట్రాటజీలు:
* సూర్యకుమార్ యాదవ్‌ను ఆరు ఇన్నింగ్స్‌లో బౌల్డ్ చేశాడు సందీప్ శర్మ. ముంబై ఓపెనర్స్‌ను త్వరగా అవుట్ చేయగలిగితే మరోసారి శర్మ.. యాదవ్‌ను పెవిలియన్ పంపించగలడు.
* బుమ్రా ఒకవేళ జట్టులో ఉంటే మాత్రం అతణ్ని ఎదుర్కోవడానికి మనీశ్ పాండేను వాడొచ్చు. బుమ్రా బౌలింగ్‌లో పాండే 25బంతులకు 52పరుగులు చేయగలిగాడు.

ఇరు జట్లకు కీలకాంశాలు:
* షార్జా వేదికగా చేజింగ్ జట్లే ఐదు సార్లు గెలిచాయి.
* ముంబైతో మ్యాచ్ లో పాండే బెనిఫిట్ గా కనిపిస్తున్నాడు. 578 పరుగులు చేయగలిగాడు. వాటిల్లో 5 హాఫ్ సెంచరీలకు మించి నమోదయ్యాయి.
* ముంబైతో జరిగిన 7మ్యాచ్‌ల్లో 8వికెట్లు తీశాడు.
* టీ20 ఫార్మాట్ లో హోల్డర్ 100వికెట్లు తీయడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. దాంతో పాటు టీ20ల్లో వెయ్యి పరుగులు చేయడానికి 20పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.
* ఐపీఎల్‌ 10ఇన్నింగ్స్‌లో కిషన్ 24సిక్సులు బాదాడు. నికోలస్ పూరన్ 25సిక్సులు తర్వాత నిలిచింది కిషన్ మాత్రమే. అంతకంటే టాప్ లో సంజూ శాంసన్ 26సిక్సులతో టాప్‌లో ఉన్నాడు.