విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించండి.. గంభీర్ సూచన

  • Published By: vamsi ,Published On : November 7, 2020 / 06:17 PM IST
విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించండి.. గంభీర్ సూచన

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. టోర్నమెంట్ నుంచి ప్లేఆఫ్స్‌లో బయటకు వచ్చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా 8వ సీజన్లో జట్టు ట్రోఫీని గెలుచుకోలేక బయటకు వచ్చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిష్క్రమించిన తరువాత, భారత మాజీ ఓపెనర్, రెండుసార్లు ఐపిఎల్ కప్పు గెలిచిన విజేత కెప్టెన్ గౌతమ్ గంభీర్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కెప్టెన్సీ నుంచి గౌతమ్ గంభీర్‌ని తొలగించాలని డిమాండ్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా కోహ్లీకి బదులుగా మరొకరిని పెట్టుకోవాలని సూచించారు.



ఐపీఎల్ 2020లో వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన విరాట్ జట్టు టోర్నీ నుంచి బయటకు వచ్చేసింది. ప్లేఆఫ్‌కు ముందు లీగ్ రౌండ్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో కూడా విరాట్ జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రారంభ 10 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో, నెట్‌నెట్‌లో కూడా ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉన్న బెంగళూరు.. ఆఖర్లో మాత్రం నిరుత్సాహ పరిచింది. ఈ క్రమంలో గంభీర్ ESPN Cric infoతో మాట్లాడుతూ, “రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. జట్టు సమస్యయ అంతా బాధ్యత గురించి. ట్రోఫీ రాకుండా 8 సంవత్సరాలు ఒక వ్యక్తిని కెప్టెన్‌గా ఉంచడం కరెక్ట్ కాదు. కోహ్లీ కెప్టెన్సీలో 2016 లో ఆర్‌సిబి జట్టు ఫైనల్‌లో ఓడిపోయింది.



విరాట్ కెప్టెన్సీ జట్టు మూడుసార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఈ జట్టు 2017 మరియు 2019 లో చివరి స్థానంలో నిలిచింది. 2018లో ఆరో స్థానంలో ఉంది. కోహ్లీ ఇప్పుడు చేతులు ఎత్తి ఓటమికి బాధ్యత వహించాల్సిన సమయం ఆసన్నమైందని గంభీర్ అన్నారు. మీరు జట్టు బాధ్యతలు స్వీకరించినట్లయితే, కెప్టెన్‌ని మార్చేస్తారా? అని గంభీర్‌ని అడిగినప్పుడు.. గంభీర్ “ఖచ్చితంగా” అని సమాధానం ఇచ్చాడు. ఇది కేవలం ఒక సంవత్సరానికి సంబంధించిన విషయం కాదు. నేను విరాట్ కోహ్లీకి వ్యతిరేకం కాదు. రవిచంద్రన్ అశ్విన్‌ను చూడండి. రెండేళ్ల కెప్టెన్సీలో జట్టు ఛాంపియన్‌గా మారకపోతే, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతనిని తొలగించింది.



మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే.. ధోని మూడు, రోహిత్ నాలుగు టైటిళ్లు గెలుచుకున్నారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే అతనిని కచ్చితంగా తొలగించే అవకాశం ఉంది అని అన్నారు. ఒకవేళ రోహిత్‌ శర్మ ఇలాగే (విరాట్ కోహ్లీలా బెంగళూరు జట్టుకు టైటిల్ అందించకపోవడం) ఎనిమిదేళ్లు రాణించకపోయి ఉంటే.. అతడిని కూడా తొలగించేవారే. ఒక్కొక్కరికీ ఒక్కో రూల్ ఉండదు. ఇక్కడ అందరూ సమానమే. మొత్తంగా ఎవరికైనా విజయాలే కావాలి. బెంగళూరు ఎక్కువగా కోహ్లీ, డివిలియర్స్‌పైనే ఆధారపడుతోంది.



ప్రస్తుతం జరిగిన సీజన్‌లో బెంగళూరు పూర్తిగా విఫలం కాకుండా డివిలియర్స్ కొన్ని మ్యాచ్‌లను కాపాడాడు.. కెప్టెన్‌గా కోహ్లీ మాత్రం పెద్దగా రాణించలేదని అభిప్రాయపడ్డాడు గంభీర్. డివిలియర్స్ కూడా రాణించకపోతే.. బెంగళూరు పరిస్థితి ఎలా ఉండేది? కలిసికట్టుగా ఆ జట్టు ఏం చేయలేదు. ఈ విషయంలో గత ఏడాది లాగే ఆడింది. డివిలియర్స్ ఒక్కడి వల్లే ఆర్సీబీ ప్లేఆఫ్ చేరినా.. డివిలియర్స్ ఒక్కడి వల్లే కప్ అయితే గెలవలేదవు కదా? అని ప్రశ్నించారు.