”చెన్నై సూపర్ కింగ్స్‌కు 2021లోనూ ధోనీనే కెప్టెన్”

”చెన్నై సూపర్ కింగ్స్‌కు 2021లోనూ ధోనీనే కెప్టెన్”

ms-dhoni

IPL చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్ కు చేరుకోకుండానే CSK (చెన్నై సూపర్ కింగ్స్) లీగ్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డాడీస్ టీం ఆశలు గల్లంతయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలవడంతోనే ఇది కన్ఫామ్ అయిపోయింది.

జట్టు ఇన్ని ఘోర పరాజయాలను ఎదుర్కోవడంతో.. టీం భవితవ్వంపై పలు ప్రశ్నల వర్షం మొదలైంది. ఇక భవిష్యత్ లేదంటూ ట్రోలింగ్‌కు దిగారు. ధోనీ ఇక కెప్టెన్సీకి పనికి రాడని ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందేనంటూ కామెంట్లు చేశారు. వాటన్నిటికీ ధీటైన సమాధానమిస్తూ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇలా చెప్పారు.



‘నిజమే కచ్చితంగా చెప్పగలను. 2021లో ధోనీనే సీఎస్కేకు కెప్టెన్సీ వహిస్తాడు. ఐపీఎల్ మూడు టైటిళ్లను తెచ్చిపెట్టాడు. మేం ప్లే ఆఫ్ లకు వెళ్లకుండా వెనుదిరగడం అనేది ఇదే తొలిసారి. మరే టీంకు ఇలా జరగలేదు. ఒక్క సంవత్సరం కలిసి రాలేదని మొత్తం మార్చేయలేం’ అని విశ్వనాథన్ అన్నారు.
https://10tv.in/sunrisers-hyderabad-beat-rajasthan-royals/
డుప్లెసిస్, శామ్ కరన్ తప్పించి మిగిలిన సీఎస్కే ప్లేయర్లు ఎవరూ ఆశించినంత ప్రదర్శన చేయలేకపోయారు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లు లేకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. కొవిడ్ భయం కూడా సీఎస్కే క్యాంప్ టీం బ్యాలెన్సింగ్ దెబ్బతినేలా చేసింది.

‘మా శక్తికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. గెలవాల్సిన మ్యాచ్ లు కూడా ఓడిపోయాం. అదే మమ్మల్ని వెనక్కునెట్టేసింది. సురేశ్ రైనా, హర్భజన్ జట్టులో లేకపోవడం, కొవిడ్ కేసులు క్యాంప్ లో నమోదు కావడం బ్యాలెన్సింగ్ ను దెబ్బతీసింది’ అని ఆయన వివరించాడు.

చివరి మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. యువ క్రికెటర్లు మరిన్ని అవకాశాలు పొందేంత ప్రదర్శన చేయలేకపోయారు. రుతురాజ్ గైక్వాడ్, నారాయణ్ జగదీశన్, మోనూ కుమార్ లాంటి వాళ్లకు మేనేజ్మెంట్ మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటుందని అన్నారు.

మొదటి మ్యూడు మ్యాచ్‌లు ఫెయిల్ అయిన తర్వాత గైక్వాడ్ బ్యాటింగ్ లో మెరుగుదల కనిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్ లో 51బంతుల్లో 65పరుగులతో రాణించాడు.