AB de Villiers: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు నమోదు చేసిన డివిలియర్స్

మిస్టర్ 360.. పేరిట మరో ఐపీఎల్ రికార్డ్ నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో విరుచుకుపడిన డివిలియర్స్ 75పరుగులతో స్కోరు బోర్డును పరుగులు ..

10TV Telugu News

AB de Villiers: మిస్టర్ 360.. పేరిట మరో ఐపీఎల్ రికార్డ్ నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో విరుచుకుపడిన డివిలియర్స్ 75పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో లీగ్‌లో 5వేల 53పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలా ఐపీఎల్ కెరీర్లో అతి తక్కువ బంతుల్లోనే 5వేల పరుగులకు మించి బాదిన ప్లేయర్ గా రికార్డు దక్కించుకున్నాడు.

3వేల 554 బంతుల్లో ఈ మైలురాయి అందుకొన్న వార్నర్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. లీగ్‌లో 5 వేల పరుగుల మార్క్‌ అందుకున్న రెండో విదేశీ క్రికెటర్‌గానూ డివిలియర్స్‌ నిలిచాడు. తొలి విదేశీ బ్యాట్స్‌మన్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (5వేల 390) ఉన్నాడు.

లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (6వేల 41) టాప్‌లో కొనసాగుతున్నాడు. అతని తర్వాతి స్థానాల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా(5వేల 472), ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(5వేల 456), ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(5వేల 431) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

లిస్టులో తర్వాత క్రిస్ గేల్ (4వేల 891పరుగులతో), రాబిన్ ఊతప్ప (4వేల 607పరుగులతో), గౌతం గంభీర్ (4వేల 217 పరుగులతో) ఉన్నారు.

10TV Telugu News