IPL 2021 : కోహ్లీ అవుట్, బెంగళూరు బ్యాటింగ్

చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ అభిమానులను నిరాశ పరిచాడు.

IPL 2021 : కోహ్లీ అవుట్, బెంగళూరు బ్యాటింగ్

Kohli

Bangalore vs Kolkata : ఐపీఎల్ 2021 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ అభిమానులను నిరాశ పరిచాడు. కేవలం మొదటి ఓవర్ లోనే కోహ్లీ వెనుదిరిగాడు. 6 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇతడిని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. తొలుత టాస్ నెగ్గిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్ ల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ మూడో విజయంపై కన్నేసింది. కోల్ కతా నైడర్స్..బెంగళూరుపై విజయం సాధించి..రెండో విజయం నమోదు చేయాలని భావిస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌,ఏబీ డివిలియర్స్‌, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, కైల్‌ జేమిసన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : మోర్గాన్‌ (కెప్టెన్‌),శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి,షకీబ్‌ అల్‌ హసన్‌, దినేశ్‌ కార్తీక్‌, రసెల్‌, కమిన్స్‌, హర్భజన్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతాదే పైచేయిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరుతో పోలిస్తే కోల్‌కతా బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో కోల్‌కత్తా గట్టిగా ఉంది. అటువంటి పరిస్థితిలో, ఈ సీజన్లో RCB వారి మొదటి ఓటమి చూసినా చూడవచ్చు. రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో కోల్‌కత్తా 14మ్యాచ్‌లు గెలవగా.. బెంగళూరు 12మ్యాచ్‌లను గెలిచింది.

 

Read More : Allu Arjun : పుష్ప సినిమాలో యాక్షన్ సీన్స్.. తగ్గేదే లే అంటున్న నిర్మాతలు, ఎపిసోడ్ కోసం రూ. 40 కోట్లు ఖర్చు!