ఐపీఎల్ 2021 షెడ్యూల్ రిలీజ్.. ఏప్రిల్ 9 నుంచే మెగా సమరం

ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్.. ఐపీఎల్‌ (ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్) 14వ సీజ‌న్ షెడ్యూల్‌ను ఆదివారం విడుద‌ల చేసింది. పలు చర్చల అనంతరం దేశ వ్యాప్తంగా ఆరు స్టేడియాల్లో టోర్నీ నిర్వహించనున్నారు. ఈ సారి తెలుగు అభిమానులు..

ఐపీఎల్ 2021 షెడ్యూల్ రిలీజ్.. ఏప్రిల్ 9 నుంచే మెగా సమరం

VIVO IPL 2021: ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్.. ఐపీఎల్‌ (ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్) 14వ సీజ‌న్ షెడ్యూల్‌ను ఆదివారం విడుద‌ల చేసింది. పలు చర్చల అనంతరం దేశ వ్యాప్తంగా ఆరు స్టేడియాల్లో టోర్నీ నిర్వహించనున్నారు. ఈ సారి తెలుగు అభిమానులు హైదరాబాద్ స్టేడియం నుంచి మ్యాచ్ ను వీక్షించడం కుదరదు.

దక్షిణ భారతదేశంలో కేవలం చెన్నై, బెంగళూరులకు అవకాశం దక్కగా, మిగిలిన స్టేడియాలు అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తాలలో మ్యాచ్ లు నిర్వహిస్తారు.

ఏప్రిల్ 9న టోర్నీ ఆరంభం:
ఐపీఎల్ 14వ సీజ‌న్‌ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 9న చెన్నై వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో సంప్రదాయం ప్రకారం.. డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌, బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక ఫైన‌ల్ మే 30న అహ్మ‌దాబాద్‌ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ఇదే స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి.

ప్ర‌తి టీమ్ నాలుగు వేదిక‌ల్లో మ్యాచ్‌లు ఆడ‌నుంది. మొత్తం 56 లీగ్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. చెన్నై, ముంబై, కోల్‌క‌తా, బెంగ‌ళూరు త‌లా 10 మ్యాచ్‌ల‌కు ఆతిథ్య‌మివ్వ‌నుండ‌గా, అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ చెరో 8 మ్యాచ్‌ల‌కు ఆతిథ్య‌ం ఇవ్వ‌నున్నాయి. ఈ సీజ‌న్ ప్ర‌త్యేకత ఏంటంటే అన్ని జట్లు త‌ట‌స్థ వేదిక‌ల్లోనే మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఏ టీమ్ కూడా హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడ‌బోవ‌డం లేదు. మ్యాచ్‌లు జరిగే సమయం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు, రాత్రి 7.30 గంట‌ల‌కుగా ఉండనుంది.