BCCI: సిడ్నీ క్వారంటైన్‌లో ఉండే ఆసీస్ క్రికెటర్ల ఖర్చు భరిస్తోన్న బీసీసీఐ

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆస్ట్రేలియా ప్లేయర్లకు వారు క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు చేయాల్సిన ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తుంది.

BCCI: సిడ్నీ క్వారంటైన్‌లో ఉండే ఆసీస్ క్రికెటర్ల ఖర్చు భరిస్తోన్న బీసీసీఐ

bcci

BCCI: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆస్ట్రేలియా ప్లేయర్లకు వారు క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు చేయాల్సిన ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తుంది. మాల్దీవుల నుంచి బయల్దేరిన ఆసీస్ ప్లేయర్లు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. అయినప్పటికీ వారి సొంతిళ్లకు వెళ్లేముందు 14రోజుల క్వారంటైన్ పీరియడ్ తప్పనిసరి.

ఈ క్రమంలో వారికి అయ్యే ఖర్చులను పూర్తిగా బీసీసీఐ భరిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ నిక్ హాక్లే వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 రద్దు కారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, కామెంటేటర్లను బీసీసీఐ ముందుగా మాల్దీవులకు పంపించింది. మే4న లీగ్ వాయిదా పడినప్పుడే ఈ నిర్ణయం తీసుకుంది.

మహమ్మారి ప్రభావానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండియా నుంచి విమానాల రాకపోకలు నిలిపేసిన సంగతి దృష్టిలో ఉంచుకునే అలా ప్లాన్ చేసింది. సోమవారం మొత్తం 38మంది సభ్యులు సిడ్నీకి చేరుకున్నారు. మే15తో ట్రావెల్ బ్యాన్ ను ఎత్తేసింది ఆస్ట్రేలియా. వారంతా ప్రస్తుతం క్వారంటైన్ లోనే ఉండాలి.

అవును బీసీసీఐనే వారికి చెల్లిస్తుంది. ఇండియన్ క్రికెట్ బోర్డు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. తామే ఆస్ట్రేలియా ప్లేయర్లను, సపోర్ట్ స్టాఫ్ ను ఇళ్లకు సేఫ్ గా వీలైనంత త్వరగా పంపిస్తామని చెప్పింది. బీసీసీఐ పనితీరు గురించి ప్లేయర్లు కూడా చాలా పాజిటివ్ గా, గొప్పగా చెప్తున్నారు. అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ అంటున్నారు.