IPL 2021 – BCCI: ఇక ఐపీఎల్ అంతా ముంబైలోనే ఆడించాలని బీసీసీఐ ప్లాన్

కొవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఆరంభించినా.. బయో బబుల్ లోకి..

IPL 2021 – BCCI: ఇక ఐపీఎల్ అంతా ముంబైలోనే ఆడించాలని బీసీసీఐ ప్లాన్

Ipl 2021

IPL 2021 – BCCI: కొవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఆరంభించినా.. బయో బబుల్ లోకి చొచ్చుకుని వచ్చి క్రికెటర్లకు అంటుకుంది. కోల్ కతా, చెన్నై సూపర్ కింగ్స్ లో కొందరికి పాజిటివ్ రావడంతో ఒక మ్యాచ్ అధికారికంగా రద్దు అయింది.

దీంతో ఐపీఎల్ రద్దు చేయాలని లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాలంటూ బీసీసీఐ మీద ఒత్తిడి పెరిగింది. అవేమీ లేకుండా మే30తో ముగియనున్న ఐపీఎల్ సీజన్ మిగతా భాగం మొత్తాన్ని ముంబైలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే రోజుకు రెండు మ్యాచ్ లు ఆడిస్తున్నారు. ఇక కొవిడ్ కారణంగా రద్దు అయిన.. అవబోయే మ్యాచ్ లను కూడా.. షెడ్యూల్ మార్చి అనుకున్న సమయానికే టోర్నమెంట్ పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్. మిగతా మ్యాచ్ లు రీ షెడ్యూల్ చేయడం చాలా కాంప్లికేటెడ్ టాస్క్. ఇంకా అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే.. 8టీంలకు ఒకే బయో బబుల్ ఏర్పాటు చేయడం.

టోర్నీ ఆరంభానికి ముందే సీజన్ మొత్తాన్ని ముంబైలోనే నిర్వహించాలని చర్చలు జరిగాయి. కానీ, బీసీసీఐ 6వేదికలకు మార్చింది. ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్ బ్రబౌర్న్ లలో మ్యాచ్ లు ఆడేందుకు రెడీగా ఉన్నాయి. వాంఖడే స్టేడియంలో మ్యాచ్ లు ఆడేందుకు మిగిలిన రెండు స్టేడియంలలో ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమయ్యాయి.