IPL 2021 – CSK: చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ వాయిదా

ఏ రంగాన్ని వదిలిపెట్టని కరోనా నిర్విరామంగా జరుగుతున్న ఐపీఎల్ లోకి చొచ్చుకుపోయింది. బయోబబుల్ వాతావరణంలో అన్ని జాగగ్రత్తల మధ్య ...

IPL 2021 – CSK: చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ వాయిదా

Csk Vs Rr

IPL 2021 – CSK: ఏ రంగాన్ని వదిలిపెట్టని కరోనా నిర్విరామంగా జరుగుతున్న ఐపీఎల్ లోకి చొచ్చుకుపోయింది. బయోబబుల్ వాతావరణంలో అన్ని జాగగ్రత్తల మధ్య నిర్వహిస్తున్న లీగ్ లోనూ కరోనా కలకలం మొదలైంది. ఐపీఎల్‌ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పింది. కేకేఆర్‌ ఆటగాళ్లకు కరోనా సోకడానికి నిబంధనలు అతిక్రమించి ఉండొచ్చని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

సీఎస్‌కే శిబిరంలో సైతం కరోనా కలకలం రేగిందనే సమాచారం బయటకు రావడంతో బుధవారం(మే5వ తేదీన) ఢిల్లీలో అరుణ్‌జైట్టీ స్టేడియంలో సీఎస్‌కే-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా వాయిదా పడేలా అవకాశాలు కనబడుతున్నాయి. ఇంతవరకూ ఎటువంటి స్పష్టత లేకపోయినా సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడటమే కాకుండా మరో ఇద్దరికి ఆ వైరస్‌ సోకిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ వాయిదా పడినట్లుగానే చెన్నై వర్సెస్ రాజస్థాన్ రేపటి మ్యాచ్ కూడా రీషెడ్యూల్‌ చేయక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై మంగళవారం సాయంత్రలోగా స్పష్టత రావొచ్చు. ఇప్పటికే బీసీసీఐ.. ఒకే వేదికలో మిగిలిన ఐపీఎల్‌ సీజన్‌ నిర్వహించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

లీగ్ లోని మిగతా మ్యాచ్‌లు మొత్తం ముంబైలోని 3 స్టేడియాల్లో జరపాలని చూస్తోంది. దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే మే7వ తేదీ నుంచి ముంబైలోనే మ్యాచ్‌లు జరగుతాయి. అన్ని జట్లు ఒకే బయోబబుల్ లో ఉండి, వేర్వేరు నగరాలకు వెళ్లకుండా నియంత్రిస్తేనే కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనేది బీసీసీఐ ప్లాన్.