IPL 2021 PBKS Vs CSK : టాస్ నెగ్గిన చెన్నై, పంజాబ్ బ్యాటింగ్

ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్ లో ఇది 8వ మ్యాచ్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది.

IPL 2021 PBKS Vs CSK : టాస్ నెగ్గిన చెన్నై, పంజాబ్ బ్యాటింగ్

Ipl 2021 Pbks Vs Csk

IPL 2021 PBKS Vs CSK : ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్ లో ఇది 8వ మ్యాచ్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది.

చెన్నై పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో ఉంది. పంజాబ్‌ మూడో స్థానంలో ఉంది. అద్భుతాలు చేయడం అలవాటని ముద్రపడిన ధోనీసేన ఈ మ్యాచ్‌లో ఏం చేస్తుందో చూడాలి. భీకర ఫాంలో ఉన్న పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం అంత సులువేమీ కాదు. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 23 ఐపీఎల్‌ మ్యాచుల్లో చెన్నై 14 విజయాలతో మెరుగైన రికార్డు కలిగి ఉంది. 9 మ్యాచుల్లో పంజాబ్‌ నెగ్గింది. గతేడాది(2020) జరిగిన రెండు మ్యాచుల్లోనూ ధోనీ సేనదే గెలుపు. మరి ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ప్రతీకారం ఎలా ఉంటుందో..

రాహుల్ దంచుడు:
పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వాంఖడేలో గత నాలుగు మ్యాచులూ చితక్కొట్టాడు. మూడుసార్లు తొంబైకిపైగా రన్స్ చేశాడు. ఓ సెంచరీ కూడా బాదాడు. మొత్తంగా అక్కడ అతడి సగటు 75 పైనే ఉంది. అతడి బ్యాటింగ్‌ ఫామ్ చూస్తుంటే ఈ రోజు మ్యాచ్‌లోనూ దంచడం ఖాయం అనిపిస్తోంది. మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనింగ్‌లో కుదురుకుంటే వీరిద్దరినీ ఆపడం చెన్నై బౌలింగ్ దళానికి కష్టమే. ఇక మొదటి మ్యాచ్‌లో గేల్‌ (40, 28 బంతుల్లో) కూడా అదరగొట్టాడు. అంచనాలు అంతగా లేని దీపక్‌ హూడా 28 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 4 బౌండరీలు, 6 సిక్సర్లతో తన సత్తా ఏంటో చూపించాడు. నికోలస్‌ పూరన్‌ కూడా దంచడం మొదలుపెడితే భారీ స్కోరు సాధించినట్టే.

ఆశలన్నీ రైనాపైనే:
ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌ల నుంచి శుభారంభాన్ని కోరుకుంటోంది చెన్నై జట్టు. తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశ పరచిన నేపథ్యంలో ఈరోజు(ఏప్రిల్ 16,2021) వీళ్ల ప్రదర్శన కీలకం కానుంది. మొయిన్‌ అలీ ఇన్నింగ్స్‌ ఆసాంతం బ్యాటింగ్‌ చేస్తే చెన్నైకు ఎంతో మేలు. అతడు తొలి మ్యాచ్‌లో మంచి బ్యాటింగ్‌ ఫామ్ లో కనిపించాడు. 36 పరుగుల్లో 4 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు. అంబటి రాయుడు, జడేజా కూడా మరిన్ని పరుగులు సాధించాలి. చెన్నై ఆశలన్నీ రైనా మీదే. 2014 సీజన్‌లో పంజాబ్‌పై 25 బంతుల్లో 87 పరుగుల సంచలన ప్రదర్శన చేశాడు. పంజాబ్‌పై చెన్నై తరఫున అత్యధిక పరుగులూ (711) అతనివే. తొలి మ్యాచ్‌లో అర్ధ శతకంతో రాణించిన రైనా చెన్నైకి ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు. ఇక ధోనీ బ్యాటింగ్‌ సైతం మరింత అండగా నిలవగలిగితే.. చెన్నైకి చింత తీరినట్టే.