IPL 2021: డేవిడ్ వార్నర్.. స్టీవ్ స్మిత్ కూడా వెళ్లిపోతున్నారా..

ఇప్పటికే ఆండ్రూ టై, రవిచంద్రన్ అశ్విన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు ఆడం జంపా, కేన్ రిచర్డ్‌సన్ టోర్నమెంట్ ను వదిలేశారు.

IPL 2021: డేవిడ్ వార్నర్.. స్టీవ్ స్మిత్ కూడా వెళ్లిపోతున్నారా..

Steve Smith David Warner

IPL 2021: ఇండియాలో పెరుగుతోన్న కరోనా కేసుల ప్రభావానికి డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వదిలి వెళ్లిపోయేలా మారింది పరిస్థితి. ఇప్పటికే ఆండ్రూ టై, రవిచంద్రన్ అశ్విన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు ఆడం జంపా, కేన్ రిచర్డ్‌సన్ టోర్నమెంట్ ను వదిలేశారు.

కొవిడ్-19 భయంతో ఇంటి బాట పట్టారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు కూడా త్వరలోనే వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని మీడియా చెప్తుంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లు ఇండియా బోర్డర్స్ క్లోజ్ అవకముందే ఆస్ట్రేలియా వెళ్లడానికి చూస్తున్నారు.

ఇక ఈ రిపోర్టులో కొవిడ్-19 ప్రభావంతో మరో 30మంది విదేశీయులు సందిగ్ధంలో పడ్డారు. ప్లేయర్లు, కామెంటేటర్లు కొవిడ్ పరిస్థితికి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొత్తం ఆస్ట్రేలియా నుంచి 14మంది వరకూ ప్లేయర్లు ఉన్నారు. కామెంటేటర్లలో బ్రెట్ లీ, మైకెల్ స్లాటర్, మాథ్యూ హైడెన్ లు ఉండగా… ముంబై ఇండియన్స్ ప్లేయర్ క్రిస్ లిన్ తమ దేశం అవసరమైతే స్పెషల్ విమానం ఏర్పాటు చేసి ప్లేయర్లను వెనక్కు తీసుకెళ్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఐపీఎల్ 2021లో ఆడే ప్లేయర్లు తమ సొంత ఖర్చు, సొంత ఏర్పాట్లతోనే స్వదేశానికి తిరిగి రావాలని చెప్పారు.