Delhi Capitals : షా ధనాధన్, కోల్ కతాపై ఢిల్లీ విక్టరీ

ఐపీఎల్ 21 లో కోల్ కతా జట్టుపై ఢిల్లీ ఘన విజయం సాధించింది. కోల్ కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.3 ఓవర్లలో చేధించింది.

Delhi Capitals : షా ధనాధన్, కోల్ కతాపై ఢిల్లీ విక్టరీ

Delhi

IPL 2021  :  ఐపీఎల్ 21 లో కోల్ కతా జట్టుపై ఢిల్లీ ఘన విజయం సాధించింది. కోల్ కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.3 ఓవర్లలో చేధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. శిఖర్ ధావన్ (46), పృథ్వీ షా (82), పంత్ (16) పరుగులు సాధించారు. స్టోయినిస్ (6) విన్నింగ్ షాట్ కొట్టి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు.

బ్యాటింగ్ కు దిగిన పృథ్వీ  షా కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. వచ్చీ రావడంతోనే..బ్యాట్ ఝులిపించాడు. ఏమాత్రం బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. వరుసగా ఫోర్లు కొట్టడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ఎలా అవుట్ చేయాలా అని బౌలర్లు బుర్ర గొక్కున్నారు. ఇతనికి శిఖర్ ధావన్ (46) చక్కటి సహకారం అందించాడు. జట్టు స్కోరు 132 పరుగుల వద్ద ధావన్ అవుట్ అయ్యాడు.

అనంతరం షాకు పంత్ జత కలిశాడు. అప్పటికే హాఫ్ సెంచరీ సాధించిన పృథ్వీ షా శతకం వైపు దూసుకెళుతున్నాడు. జట్టు స్కోరు 146 వద్ద షా (82) అవుట్ చేశాడు. పంత్ (16) అవుట్ కాగా విజయానికి కావాల్సిన పరుగులను స్టోయినిస్ 6 విన్నింగ్ షాట్ కొట్టాడు. దీంతో 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

అంతకుముందు..బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో చివరిలో వచ్చిన రస్స్సేల్ 45 టాప్ స్కోరర్ గా నిలిచాడు. సుభాన్ గిల్ 43 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

ఢిల్లీ బౌలింగ్ లో అక్సర్ పటేల్, లలిత్ యాదవ్ లకు చెరో రెండు వికెట్లు తీశారు. స్టొయినిస్, అవేశ్ ఖాన్ కు చెరో వికెట్ దక్కాయి.
కోల్ కతా జట్టులో కమిన్స్ కు మూడు వికెట్లు దక్కాయి.

Read More : Cash Theft : కూకట్ పల్లిలో కాల్పులు, 8 గంటల్లోనే దుండగుల పట్టివేత