IPL 2021: కొవిడ్ వణుకు పుట్టిస్తుంటే ఐపీఎల్ నిర్వహించడం అవసరమేనా – గిల్‌క్రిస్ట్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడం గిల్ క్రిస్ట్ శనివారం ట్విట్టర్ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు. ఇండియాలో కొద్ది వారాలుగా కరోనావైరస్..

IPL 2021: కొవిడ్ వణుకు పుట్టిస్తుంటే ఐపీఎల్ నిర్వహించడం అవసరమేనా – గిల్‌క్రిస్ట్

Gilchrist

IPL 2021: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడం గిల్ క్రిస్ట్ శనివారం ట్విట్టర్ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు. ఇండియాలో కొద్ది వారాలుగా కరోనావైరస్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇండియన్ అభిమానులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూనే ఈ మాజీ వికెట్ కీపర్.. ఇలాంటి సందర్భంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2021 కంటిన్యూ చేయడం అవసరమా అని ప్రశ్నలు గుప్పించాడు.

కొవిడ్ కేసులు పెరిగిపోతున్న ఇండియాలోని అభిమానులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సమయంలోనూ ఐపీఎల్ కంటిన్యూ చేయడం అవసరమా.. సరైనదేనా.. ప్రతి రోజూ ఈ కొవిడ్ భయాందోళన నుంచి ఉపశమనం కోసం అవసరమేనా.. మీ ఆలోచన ఏదైనా.. నా ప్రార్థనలు ఎప్పుడూ మీతో ఉంటాయని గిల్‌క్రిస్ట్ ట్విట్టర్లో పోస్టు చేశాడు.

అతని ట్వీట్ కు రెస్పాన్స్ ఇచ్చిన నెటిజన్లు ఐపీఎల్ అనేది చాలా ముఖ్యమైన ఏమార్పు కిందే పేర్కొన్నారు. ఇంత టఫ్ టైంలో కూడా ఎంటర్ టైన్మెంట్ ఇస్తుందని పొగుడుతున్నారు. ఇంకొకరేమో.. ఇంట్లోనే కూర్చొని ఉండేవాళ్లకు ఇది మంచి ఏమార్పు కింద ఎంటర్ టైన్ చేస్తుందని ట్వీట్ చేశాడు. మరొకరేమో.. దేశవ్యాప్తంగా ఉన్న వారంతా ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ చూస్తుంటారు. అదే ఒక పాజిటివ్ అంశం. అని ట్వీట్ చేశాడు.

గిల్ క్రిస్ట్ ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆరు సీజన్లు అంటే 2008 నుంచి 2013 వరకూ ఆడాడు. మొత్తం ఆడిన 80మ్యాచ్ లలో 2069 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఐపీఎల్ టైటిల్ గెలిచాడు.