IPL 2021 – Chetan Sakariya: బూట్లు కూడా లేకుండా.. గుమస్తా పనిచేస్తూ ఐపీఎల్‌ స్టార్‌డమ్ వరకూ చేతన్ సకారియా

రాజ్ కోట్‌కు 180 కిలోమీటర్ల దూరంలో వార్జెజ్ లో జన్మించిన ఈ లెఫ్టార్మ్ పేసర్ సకారియా ఓ దశలో బూట్లు లేకుండా ..

IPL 2021 – Chetan Sakariya: బూట్లు కూడా లేకుండా.. గుమస్తా పనిచేస్తూ ఐపీఎల్‌ స్టార్‌డమ్ వరకూ చేతన్ సకారియా

Chetan Sakariya

IPL 2021 – Chetan Sakariya: రాజస్థాన్ రాయల్స్‌కు ఒక అలవాటు ఉంది. యంగ్ ప్లేయర్లను తీసుకొచ్చి యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంటుంది. అలా చాలా సీజన్లుగా కొత్త ప్లేయర్లను చూస్తూనే ఉన్నాం. సోమవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లోనూ చేతన్ సకారియా అనే మీడియా ఫాస్ట్ బౌలర్ తళుక్కుమనిపించాడు. 4ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన చేతన్.. 31పరుగులిచ్చి 3వికెట్లు పడగొట్టాడు.

మొదటి ఓవర్లో 10పరుగులు ఇచ్చిన తర్వాత జాగ్రత్త పడ్డాడు. తర్వాత అగర్వాల్ వికెట్ పడగొట్టడంతో నమ్మకం పెరిగింది. పవర్ ప్లేలో క్రిస్ గేల్ ఆడుతున్నప్పుడు రెండు డాట్ బాల్స్ వేసి మెప్పించాడు. బూట్లు లేకుండా క్రికెట్ ఆడుతూ వచ్చి ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. తన పేస్, స్వింగ్ తో ప్రత్యర్థులపై బంతితో దాడి చేశాడు. రెండో ఓవర్ లోనే మయాంక్ అగర్వాల్ ను పెవిలియన్ కు పంపి సత్తా చాటుకున్నాడు.

దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను చివరి ఓవర్లలో.. రిచర్డ్‌సన్‌ను అవుట్ చేశాడు. దానికితోడు ఫీల్డింగ్ లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఈ ఏడాది ఐపిఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ చేతన్ సకారియాను 1.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది.

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్‌కు 180 కిలోమీటర్ల దూరంలో వార్జెజ్ లో జన్మించిన ఈ లెఫ్టార్మ్ పేసర్ సకారియా ఓ దశలో బూట్లు లేకుండా కూడా క్రికెట్ ఆడాడు. క్రికెట్ మీద మక్కువతో టెన్నిస్ బంతితో తొలుత బ్యాటింగ్ మీదనే దృష్టి పెట్టినప్పటికీ ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ గా మారాడు. 16 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఏ విధమైన లేకుండానే ఆడాడు.

ఆ తర్వాత సౌరాష్ట్ర తరఫున జూనియర్ జట్టులో చేరాడు. కాగా, 17 ఏళ్ల వయస్సులో గాయం కారణంగా ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. ఈ సమయంలో కుటుంబ పోషణ కోసం తన మేనమామ వ్యాపారం చూసుకుంటూ గుమస్తాగా పనిచేశాడు.

కూచ్ బెహార్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసి.. దాంతో MRF పేస్ పౌండేషన్ ఆధ్వర్యంలో పేసర్ మెక్ గ్రాత్ వద్ద శిక్షణ పొందే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 2018-19 సీజన్ రంజీల్లో ఆడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఐపీఎల్ తొలి మ్యాచ్‌తోనే తానేమిటో చాటుకున్నాడు.