IPL 2021, DCvsPBKS: పంజాబ్‌పై ఢిల్లీ ధనాదన్ విజయం

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది.

IPL 2021, DCvsPBKS: పంజాబ్‌పై ఢిల్లీ ధనాదన్ విజయం

Ipl 2021 Dc Vs Pbks

IPL 2021, DCvsPBKS: ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 10బంతులు మిగిలి ఉండగానే క్రీజులో ఉన్న మార్కస్ స్టోనీస్(27) రిలే మెరెడిత్ వేసిన 18.2వ బంతిని ఫోర్ బౌండరీకి తరలించి మ్యాచ్ కు స్టైలిష్ ఫినిషింగ్ ఇచ్చాడు.

గబ్బర్ ఆడిన ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. 49బంతుల్లో 92పరుగులు చేసిన ధావన్ 13ఫోర్లు, 2సిక్సులతో భయంకరంగా చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా(32; 17బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సులు) శుభారంభాన్ని నమోదు చేశాడు. స్మీవ్ స్మిత్ (9), కెప్టెన్ రిషబ్ పంత్ (15), లలిత్ యాదవ్(12)పరుగులు చేయగా… పంజాబ్ బౌలర్లు రిచర్డ్ సన్ 2, మెరెదిత్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీయగలిగారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు పరవాలేదనిపించారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (69; 36 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సులు), కేఎల్ రాహుల్ (61; 51 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులు) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్‌వోక్స్, లక్మన్ మెరివాలా, కగిసో రబాడ, అవేష్ ఖాన్ తలో వికెట్ తీశారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. పంజాబ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్.. ఆరంభం నుంచే పోటీపడి మరీ బౌండరీలు బాదేశారు. ఎంతలా అంటే..? ఢిల్లీ టాప్ రేంజ్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ బౌలింగ్‌లో మయాంక్ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో.. కేఎల్ రాహుల్ కూడా ఒకటి కొట్టేశాడు. అలా ఒకే ఓవర్‌లో రబాడ 20 పరుగులు సమర్పించుకున్నాడు.

ప్రమాదకరంగా మారిన ఈ జోడీకి లక్మన్ మెరివాలా బ్రేక్ వేశాడు. పంజాబ్ స్కోరు 122 వద్ద మయాంక్‌ని ఔట్ చేయడం ద్వారా పంజాబ్ స్కోరు బోర్డు నెమ్మదించింది. 16వ ఓవర్ వరకూ క్రీజులో ఉన్న కెప్టెన్ కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అలానే మయాంక్ ఔట్ తర్వాత వచ్చిన క్రిస్‌గేల్ (11: 9 బంతుల్లో సిక్సు) తేలిపోగా.. నికోలస్ పూరన్ (9: 8 బంతుల్లో ఫోర్) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫెయిలయ్యాడు.

చివర్లో హిట్టర్లు దీపక్ హుడా (22 నాటౌట్: 13 బంతుల్లో 2సిక్సులు), షారూక్ ఖాన్ (15 నాటౌట్: 5 బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్సు) భారీ షాట్లు ఆడటంతో పంజాబ్ 195 పరుగులు చేయగలిగింది.