IPL 2021 : ధావన్ దంచి కొట్టాడు.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ క్రమంలో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ గా రిషబ్ కు ఇది తొలి విజయం

IPL 2021 : ధావన్ దంచి కొట్టాడు.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

Ipl 2021 (2)

IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ క్రమంలో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ గా రిషబ్ కు ఇది తొలి విజయం కావటం విశేషం. ఢిల్లీ ఓపెనర్లు శిఖర్‌ ధావన్ 54 బంతుల్లో‌ 85, పృథ్వీ షా 38 బంతుల్లో 72 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

 

చెన్నైని మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో శిఖర్ ధావన్ దంచి కొట్టి 85 పరుగులు చేశారు. ఆ తరువాత ధావన్ 167 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం 186 పరగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ మార్కస్‌ స్టయినీస్ వికెట్‌ను‌ కోల్పోయింది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 138 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఢిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా 72 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బ్రావో బౌలింగ్‌లో మొయిన్‌ ఆలీకి క్యాచ్‌ ఇచ్చి మొదటి వికెట్‌ రూపంలో ఔటయ్యాడు.

ధావన్‌, షాలు అర్థసెంచరీలు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పృథ్వీ షా, ధావన్‌లు పోటీ పడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. దీంతో 10 ఓవర్లలోనే ఢిల్లీ 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలోనే ధావన్‌, షాలు అర్థ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 107 పరుగులు చేసింది.

పృథ్వీ షా ఫోర్ల హ్యాట్రిక్..
ఇన్నింగ్స్‌ 5వ ఓవర్లో పృథ్వీ షా వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్టింగ్ నుంచి ఇన్నింగ్స్‌ను దూకుడు చూపించింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షాలు బౌండరీలు బాదటంతో స్కోరు బోర్డు రేంజ్ పెరిగిపోయింది.

సామ్‌ కరన్‌ మెరుపులతో సీఎస్‌కే స్కోరు పరుగులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. చివర్లో సామ్‌ కరన్‌ 15 బంతుల్లోనే 4 ఫోర్లు.. 2 సిక్సర్లతో 34 పరుగులతో విజృంభించడంతో సీఎస్‌కే భారీ స్కోరు దిశగా పయనించింది.

మిస్టర్ కూల్ ధోని డకౌట్‌..
సీఎస్‌కే వరుస విరామాల్లో రెండు వికెట్లను కోల్పోయింది. ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ తొలి బంతికే రైనా( 54) రనౌట్‌ అయ్యాడు. జడేజాతో సమన్వయ లోపం వల్ల రైనా అవుట్‌ కావాల్సి​ వచ్చింది. ఆ తర్వాత ఒక్క బంతి తేడాతో కెప్టెన్‌ ధోని క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 137 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది.

23 పరుగులు చేసి రాయుడు ఔట్‌
సీఎస్‌కే నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లతో 23 పరుగులు చేసిన అంబటి రాయుడు నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. టామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన రాయుడు.. ధవన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 123 పరుగుల వద్ద సీఎస్‌కే నాల్గో వికెట్‌ను నష్టపోయింది. రైనా మెరుపు సెంచరీ తర్వాత రాయుడు ఔటయ్యాడు.

సత్తా చాటిన సురేష్ రైనా 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీ
గత ఐపీఎల్‌కు సీజన్‌కు దూరమైన సురేశ్‌ రైనా.. ఈ సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించి తన సత్తా చూపించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో వీరవిహారం చేస్తూ హాఫ్‌ సెంచరీ చేశాడు. వికెట్లు కోల్పోయు కష్టాల్లో పడ్డ సీఎస్‌కేను సరైన సమయంలో రైనా ఆదుకున్నాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే పరుగుల మోత మోగించాడు. రైనా రేంజ్ తో 13 ఓవర్లలో సీఎస్‌కే మూడు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.

60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై
చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడో వికెట్‌ను నష్టపోయింది. సీఎస్‌కే స్కోరు 60 పరుగుల వద్ద ఉండగా మొయిన్‌ అలీ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో 36 పరుగులు చేసిన మొయిన్‌.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన మొయిన్‌ మళ్లీ భారీ షాట్‌కు యత్నించి ధవన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

ఢిల్లీ ‍క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కేకు ఆదిలోనే హంసపాదులాగా ఎదురుదెబ్బ తగిలింది. మొదట ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ డు ప్లెసిస్‌ డకౌట్‌గా వెనుదిరగ్గా… వోక్స్‌ వేసిన మరుసటి ఓవర్లో 5 పరుగులు చేసిన రుతురాజ్‌ స్లిప్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్‌కే 7 పరుగుల వద్దే వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ‌ అలా చెన్నైని మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాన్ని సాధించింది.