IPL 2021: ఐపీఎల్‌ నిరవధిక వాయిదా

కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రస్తుత సీజన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. అనుకున్న షెడ్యూల్..

IPL 2021: ఐపీఎల్‌ నిరవధిక వాయిదా

Ipl 2021 Cancel

IPL 2021: కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రస్తుత సీజన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఐపీఎల్ 14 పూర్తి చేసి తీరతామని గతంలో ప్రెసిడెంగ్ గంగూలీ చెప్పారు.

బయోబబుల్ ఏర్పాటు చేసి క్రికెటర్లను, సహాయ సిబ్బందిని సురక్షితంగా ఉంచాలని ప్లాన్ చేసిన బీసీసీఐ.. సోమవారం కేకేఆర్ ప్లేయర్లు పాజిటివ్ రావడంతో పరిస్థితిని పున సమీక్షించింది. అదే రోజు సీఎస్కే బౌలింగ్ కోచ్ తో పాటు మరో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది.

దీంతో వేదికను కేవలం ముంబైకే పరిమితం చేసి ఐపీఎల్ నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ అది కూడా అంత సురక్షితం కాదని నిర్ణయించి ప్రస్తుత సీజన్ ను రద్దు చేసినట్లు వైస్ ప్రెసిడెంట్ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.