IPL 2021: షాకింగ్‌గా ఉంది – సీఎస్కేతో ఓటమిపై సంజూ శాంసన్

రవీంద్ర జడేజా, మొయిన్ అలీల స్పిన్ మాయాజాలమే మ్యాచ్ ను తిప్పేసింది. మరి ఈ మ్యాచ్ షాక్ కు గురి చేసి..

IPL 2021: షాకింగ్‌గా ఉంది – సీఎస్కేతో ఓటమిపై సంజూ శాంసన్

Sanju Samson

IPL 2021: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 45పరుగుల తేడాతో గెలిచేసింది. సీఎస్కే నిర్దేశించిన 189 పరుగుల టార్గెట్ ను అందుకోలేక చేతులెత్తేసింది. రవీంద్ర జడేజా, మొయిన్ అలీల స్పిన్ మాయాజాలమే మ్యాచ్ ను తిప్పేసింది. మరి ఈ మ్యాచ్ వైఫల్యం తనను షాక్ కు గురి చేసిందంటున్నాడు రాజస్థాన్ కెప్టెన్.

ఇది చేధించడానికి మంచి స్కోర్ అని భావించా. కానీ, మిడిలార్డర్లో వరుస వికెట్లు కోల్పోయాం. మా బౌలర్లు బాగా ఆడారు. వాళ్ల బ్యాటింగ్ విభాగాన్ని ఇబ్బంది పెట్టాం. చివర్లో బ్రావో వచ్చి కొన్ని బాల్స్ కనెక్ట్ చేశాడు. అదీ కాక 10-15 పరుగులు ఎక్స్ ట్రా ఇచ్చాం. అంత స్పిన్ వస్తుందని ఊహించలేదు. మంచు కురవలేదు.. అయినా బంతి తిరిగిపోయింది. అది షాకింగ్ గా అనిపించింది.

ఈ ఫార్మాట్ మమ్మల్ని రిస్క్ ఎక్కువ చేయడానికే డిమాండ్ చేస్తుంది. తరచూ అవుట్ అవడమనేది ఇందులో కామన్. బేసిక్స్ పై ఇంకా పనిచేస్తాం. ముందు అనుకున్నట్లు ఈ పిచ్ స్వభావం అంత ఈజీగా లేదు. ఓ జట్టుగా బాగా ఆడాం. ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉంది’ అని ఈ యువ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.