IPL 2021 KKR Vs MI : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

ఐపీఎల్ 2021 సీజన్ లో మరో రసవత్తర పోరు జరగనుంది. చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ తమ రెండో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు.

IPL 2021 KKR Vs MI : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

Ipl 2021 Kkr Vs Mi

IPL 2021 KKR Vs MI : ఐపీఎల్ 2021 సీజన్ లో మరో రసవత్తర పోరు జరగనుంది. చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ తమ రెండో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ముంబైని కూడా ఓడించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓటమిపాలైన ముంబై ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని చూస్తోంది.

ఈ మ్యాచ్‌లో తమ స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ తిరిగి జట్టులోకి వస్తుండగా.. ముంబై గెలుస్తామనే ధీమాతో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ డి కాక్ లేకుండా మైదానంలోకి వెళ్ళగా.. డికాక్ లేని లోటు మ్యాచ్‌లో కనిపించింది. ఈ మ్యాచ్‌లో డికాక్, రోహిత్ శర్మ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో క్రిస్ లిన్ ఓపెనర్‌గా మైదానంలోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో లిన్ 35 బంతుల్లో 49 పరుగులు చేసి 4 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో.. ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో, కీరన్ పొలార్డ్ ఐదవ స్థానంలో, హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఉండగా.. ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా కూడా మెరుపు వేగంతో పరుగులు తియ్యగలడు.

ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండగా.. ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహార్ భుజాలపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది.

చెన్నై చిదంబరం స్టేడియంలో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండనుండగా.. కోల్‌కత్తాకు మంచి అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో 56 బంతుల్లో 80 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రానా మరోసారి గిల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. లాస్ట్ మ్యాచ్‌లో 29 బంతుల్లో 53 పరుగులు ఆడిన రాహుల్ త్రిపాఠి కూడా అదే ప్లేస్‌లో దిగే అవకాశం ఉంది. కెప్టెన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో బాదితే ముంబైపై విజయం కష్టం కాదు.