IPL 2021-Sanju Samson: పరిస్థితులకు తగ్గట్లు ఆడటం నేర్చుకున్నా – సంజూ శాంసన్

ఐపీఎల్ లో కొన్నేళ్లుగా అదే పని చేస్తున్నానని తన ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ అన్నాడు...

IPL 2021-Sanju Samson: పరిస్థితులకు తగ్గట్లు ఆడటం నేర్చుకున్నా – సంజూ శాంసన్

Sanju Samson

IPL 2021-Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పరిస్థితులకు తగ్గట్లు ఆడటం చాలా ముఖ్యమని అంటున్నాడు. ఐపీఎల్ లో కొన్నేళ్లుగా అదే పని చేస్తున్నానని తన ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ అన్నాడు. ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై వేదికగా జరిగిన 18వ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ 6వికెట్ల తేడాతో గెలిింది.

ఐపీఎల్ 2021 ఓపెనింగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో ఆడుతూ వరుసగా వికెట్లు కోల్పోవడంపై సంజూ శాంసన్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇంకా ఆ తర్వాత మ్యాచ్ లలోనూ షాట్ లు కొట్టడానికి ప్రయత్నించి 4, 1, 21ల వద్ద వికెట్లు కోల్పోయాడు.

శాంసన్ ఇదే టోర్నమెంట్ లో మరో రకంగా కామెంట్లు చేశాడు. ఒకవేళ ఫెయిల్యూర్లు వచ్చినా కూడా అతను షాట్ లు ఆడటం మానను అంటూ కామెంట్లు చేశాడు. వాటిని పక్కకుపెడితే శనివారం మ్యాచ్ లో శాంసన్ యాంకర్ రోల్ వహంచాడు. కోల్ కతాపై 134పరుగుల లక్ష్యం చేధించడానికి వికెట్ కాపాడుకున్నాడు.

సీనియర్ బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ తో కలిసి పరుగులు తీసేందుకు ప్రయత్నింారు. అద్భుతమైన షాట్లు ఆడి మ్యాచ్ ముగించాలనుకోకుండా 19వ ఓవర్లోనూ సింగిల్ తీసి మ్యాచ్ ముగించాడు. శాంసన్ మెచ్యూర్ గేమ్ ప్లాన్ కు తోడు క్రిస్ మోరిస్ 4/23తో రాయల్స్ ను 6వ స్పాట్ కు చేర్చాడు. కోల్ కతా వరుస 4ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి వెళ్లిపోయింది.

నా ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ గేమ్ ప్లాన్ తో ఆడేందుకు రాను. నా బ్యాటింగ్ ఎంజాయ్ చేయడానికే ప్రయత్నిస్తా. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో పరిస్థితికి తగ్గట్లు ఆడటానికే ట్రై చేస్తా. నా ఆటతీరును డిమాండ్ చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా అదే నేర్చుకున్నా. స్పీడ్ గా ఆడేసి హాఫ్ సెంచరీ చేసినా జట్టు గెలవకపోతే బాగోదు’ అని రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ అంటున్నాడు.