IPL 2021: అంబరానికి చెన్నై స్కోరు.. 27 బంతుల్లో 72 బాదిన రాయుడు

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు.

IPL 2021: అంబరానికి చెన్నై స్కోరు.. 27 బంతుల్లో 72 బాదిన రాయుడు

Csk Mi

IPL 2021: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. డుప్లెసిస్‌(50: 28 బంతుల్లో 2×4, 4×6), మొయిన్‌ అలీ(58: 36 బంతుల్లో 5×4, 5×6), అంబటి రాయుడు(72 నాటౌట్‌: 27 బంతుల్లో 4×4, 7×6 ) మెరుపు అర్ధశతకాలతో చెలరేగారు.

ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. చివర్లో రాయుడు వీరవిహారం చేశాడు. ఆఖరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించి జట్టు స్కోరును అలవోకగా 200 దాటించాడు.

ముంబై బౌలర్లలో పొలార్డ్‌ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా చెరో వికెట్‌ తీశారు. అంతకంటే ముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

తాజా సీజన్‌లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌లాడి కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది.