IPL 2021, MIvsCSK: చెన్నైపై ముంబై ఫీల్డింగ్

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం జరుగుతోన్న మ్యాచ్‌లో ..

IPL 2021, MIvsCSK: చెన్నైపై ముంబై ఫీల్డింగ్

Csk Vs Mi

IPL 2021, MIvsCSK: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌లాడి కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది.

చెన్నై టీమ్ చివరిగా ఆడిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ని అలవోకగా ఓడించగా.. రాజస్థాన్‌పై విజయంతో ముంబై కూడా గెలుపుతో ఫామ్ లోకి వచ్చింది.

ఐపీఎల్‌లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న చెన్నై, ముంబై హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..? ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 30 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ఏకంగా 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. మిగిలిన 12 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

Mumbai Indians: Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Kieron Pollard, Hardik Pandya, Krunal Pandya, James Neesham, Rahul Chahar, Dhawal Kulkarni, Jasprit Bumrah, Trent Boult

Chennai Super Kings: Ruturaj Gaikwad, Faf du Plessis, Moeen Ali, Suresh Raina, Ambati Rayudu, MS Dhoni(w/c), Ravindra Jadeja, Sam Curran, Shardul Thakur, Lungi Ngidi, Deepak Chahar