IPL 2021 SRH Vs MI హైదరాబాద్ వర్సెస్ ముంబై.. గెలుపెవరిది..?

ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో రసవత్తర పోరు జరగనుంది. హైదరాబాద్, ముంబై జట్లు తలపడనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో మొదటి రెండు మ్యాచ్ లను ఓడిపోవడం కొత్తేమీ కాదు. 2014, 2016, 2020ల్లోనూ రెండు మ్యాచుల్లోనూ పరాజయమే. అయినా 2016లో టైటిల్ గెల్చింది. 2020లో ప్లేఆఫ్ కెళ్లింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి మూడో ఓటమి ప్రమాదం పొంచుంది. ఈరోజు(ఏప్రిల్ 17,2021) మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను ఎదుర్కొంటోంది.

IPL 2021 SRH Vs MI హైదరాబాద్ వర్సెస్ ముంబై.. గెలుపెవరిది..?

Mumbai Indians Vs Sun Risers Hyderabad

IPL 2021 MI Vs SRH : ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో రసవత్తర పోరు జరగనుంది. హైదరాబాద్, ముంబై జట్లు తలపడనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో మొదటి రెండు మ్యాచ్ లను ఓడిపోవడం కొత్తేమీ కాదు. 2014, 2016, 2020ల్లోనూ రెండు మ్యాచుల్లోనూ పరాజయమే. అయినా 2016లో టైటిల్ గెల్చింది. 2020లో ప్లేఆఫ్ కెళ్లింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి మూడో ఓటమి ప్రమాదం పొంచుంది. ఈరోజు(ఏప్రిల్ 17,2021) మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను ఎదుర్కొంటోంది.

బౌలింగ్ లో సరిజోడనుకన్నా.. బ్యాటింగ్ లో మాత్రం ముంబై ఎడ్జ్ లోనే ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో కోరి ఓడిపోయినట్లయ్యింది. రాయల్ ఛాలంజర్స్ తో మరీ దారుణం. చివరి ఓవర్లలో గెలిచే మ్యాచును అప్పనంగా అప్పగించింది. మొదటి రెండు గేమ్స్ లో చెపాల్ లోనే టార్గెట్ ను చేజ్ చేసింది. మొదట్లో బాగానే ఆడినా… ఆ తర్వాత షాట్ల ఎంపికలో తెలివి లోపించింది. నైట్ రైడర్స్ గేమ్ లో మిడిల్ ఆర్డర్ లో నిలకడ లోపించింది. మిడిల్ ఆర్డర్ ఒక్కసారిగా ఎక్స్ పోజ్ అయ్యింది.

మూడో మ్యాచ్ లోనూ డిపెండబుల్ విలియమ్స్ ను ఆడించలేకపోవచ్చు. బౌలింగ్ పిచ్ లపై, లో స్కోరింగ్ మ్యాచ్ ల్లో కేన్ తిరుగులేని ఆటగాడు. అలాగని కేన్ లేనంత మాత్రాన, సన్ రైజర్స్ బలహీనమైన జట్టేమీ కాదు, కనీసం పేపర్ మీదైనా పేకమీడలా కనిపిస్తున్న బ్యాటింగ్ కు ఊపునివ్వాలంటే బెయిర్ స్టోని ఓపెనర్ గా దింపి, కీపింగ్ బాధ్యతలను అప్పగిస్తే, సాహా ప్లేస్ లో కేదర్ జాదవ్ ను ఆడించొచ్చు. ఒకటి రెండు ఓవర్లు బౌలింగ్ చేయించొచ్చు.

ఇలాంటి టీం కాంబినేషన్ సమస్యలు ముంబై ఇండియన్స్ కు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్లు ఛాంపియన్ టీంలో ఆడతారు. బెదురన్నదే ఉండదు. ఈసారి జయంత్ యాదవ్ ను బరిలోకి దింపొచ్చు.