IPL 2021 PBKS Vs CSK : నిప్పులు చెరిగిన చాహర్.. కుప్పకూలిన పంజాబ్.. చెన్నై ముందు ఈజీ టార్గెట్

పంజాబ్‌ కింగ్స్‌ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేశారు. ముఖ్యంగా చెన్నై బౌలర్ దీపక్ చాహర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా పంజాబ్ లో స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106

IPL 2021 PBKS Vs CSK : నిప్పులు చెరిగిన చాహర్.. కుప్పకూలిన పంజాబ్.. చెన్నై ముందు ఈజీ టార్గెట్

Chennai Target 107

IPL 2021 PBKS Vs CSK : పంజాబ్‌ కింగ్స్‌ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేశారు. ముఖ్యంగా దీపక్ చాహర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. చాహర్ దెబ్బకి పంజాబ్ టాప్ ఆర్డర్ కూలింది. ఫలితంగా పంజాబ్ లో స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులే చేసింది. పంజాబ్ మొత్తం ఇన్నింగ్స్ లో ఒక్క బ్యాట్స్ మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. యువ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ ఖాన్‌(47; 36 బంతుల్లో 4×4, 2×6) ధాటిగా ఆడాడు.

దీపక్‌ చాహర్‌ (13/4) నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో పంజాబ్‌‌ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(5), మయాంక్‌ అగర్వాల్‌(0)తో పాటు క్రిస్‌గేల్‌(10), దీపక్‌ హుడా(10), నికోలస్‌ పూరన్‌(0) టాప్‌ ఆర్డర్‌ మొత్తం పూర్తిగా విఫలమైంది. రాహుల్‌ రనౌట్‌ కాగా, మిగతా అందర్నీ చాహర్‌ పెవిలియన్‌ పంపాడు. దీపక్ చాహర్ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్ లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు.

deepak
ఈ దశలోనే క్రీజులోకి అడుగుపెట్టిన యువ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ ఖాన్‌(47; 36 బంతుల్లో 4×4, 2×6) ధాటిగా ఆడినా మరో ఎండ్‌లో అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. రిచర్డ్‌సన్‌(15)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు, మురుగన్‌ అశ్విన్‌(6)తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించాడు.

చివర్లో మహ్మద్‌ షమి(9)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 14 పరుగులు జోడించాడు. అయితే, ఆఖరి ఓవర్‌లో అర్ధశతకానికి చేరువైన వేళ భారీ షాట్‌ ఆడిన షారుఖ్‌.. జడేజా చేతికి చిక్కాడు. దీంతో పంజాబ్‌ 101 పరుగుల దగ్గర ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. చివరికి చెన్నై ముందు 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక చెన్నై బౌలర్లలో సామ్‌కరన్‌, మోయిన్‌ అలీ, బ్రావో తలో వికెట్‌ పడగొట్టారు.

deepak chahar