IPL 2021: కోల్‌కతా ఫీల్డింగ్, మార్పుల్లేవమ్మా…

27 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడగా.. 18 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది.

IPL 2021: కోల్‌కతా ఫీల్డింగ్, మార్పుల్లేవమ్మా…

Ipl 2021

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుస వైఫల్యాలతో బేజారెత్తిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అహ్మదాబాద్‌లో స్టేడియం వేదికగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాల్గింటిలో ఓడగా.. పంజాబ్ కింగ్స్ ఐదింటికి రెండింటిలో విజయం సాధించింది.

ఐపీఎల్‌లో పంజాబ్, కోల్‌కతా రికార్డుల్ని పరిశీలిస్తే..? ఇప్పటి వరకూ 27 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడగా.. 18 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. పంజాబ్‌పై కోల్‌కతా చేసిన అత్యధిక పరుగులు 245కాగా.. కోల్‌కతాపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 214 పరుగులు.

కోల్‌కతా జట్టులో ఓపెనర్లు నితీశ్ రాణా, శుభమన్ గిల్ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తుండగా.. నెం.3లో ఆడుతున్న రాహుల్ త్రిపాఠి దూకుడుగా మాత్రమే ఆడుతూ.. మెరుగైన స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాడు. ఇక కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్ తక్కువ స్కోర్లకే వికెట్ చేజార్చుకుంటున్నారు. ఆల్‌రౌండర్లు ఆండ్రూ రస్సెల్, పాట్ కమిన్స్ మెరుపులు ఒక మ్యాచ్‌కే పరిమితమవగా.. దినేశ్ కార్తీక్ ఫినిషర్ రోల్‌ని పోషించలేకపోతున్నాడు.

కోల్‌కతా బౌలర్లలో పాట్ కమిన్స్‌ అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ ఈ పేసర్ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. అలానే ప్రసీద్, శివమ్ మావి కూడా జట్టుని గెలిపించే ప్రదర్శన ఇప్పటి వరకూ కనబరచలేకపోయారు. మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాత్రం పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. వికెట్ల తీయలేకపోతున్నాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో వేరియేషన్ కనిపించడం లేదు.

పంజాబ్ కింగ్స్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌‌లో కొనసాగుతుండగా.. అతనితో కలిసి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడేస్తున్నాడు. క్రిస్‌గేల్ కూడా సిచ్యుయేషన్ తగ్గట్లు ఆడుతుండటంతో పంజాబ్ టీమ్‌ మెరుగైన స్కోర్లు చేయగలగుతోంది. నికోలస్ పూరన్ వరుస డకౌట్లతో నిరాశపరుస్తుండగా.. దీపక్ హుడా, హెన్రిక్యూస్, షారూక్ ఖాన్ మ్యాచ్‌లను ఆశించిన స్థాయిలో ఫినిష్ చేయలేకపోతున్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఆరంభంలోనే ఔటైతే.. ఇక అంతే.