IPL 2021, SRHvsCSK: రైజర్స్ బ్యాటింగ్, నిలబడాలంటే గెలవాల్సిందే

ఐపీఎల్ 2021 సీజన్‌లో 23వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి...

IPL 2021, SRHvsCSK: రైజర్స్ బ్యాటింగ్, నిలబడాలంటే గెలవాల్సిందే

Ipl 2021 Srhvscsk Sunrisers Hyderabad Opt To Bat

IPL 2021, SRHvsCSK: ఐపీఎల్ 2021 సీజన్‌లో 23వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ తుది జట్టులోకి మనీశ్ పాండే, సందీప్ శర్మ వచ్చారు.

చెన్నై తుది జట్టులో కెప్టెన్ ధోనీ రెండు మార్పులు చేశాడు. డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్ స్థానాల్లో లుంగి ఎంగిడి, మొయిన్ అలీ టీమ్‌లోకి వచ్చారు. ఫస్ట్ మ్యాచ్‌లో మాత్రమే ఓడిన చెన్నై ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుస్తూ.. పాయింట్ల పట్టికలో టాప్ 2కు చేరింది.

మరోవైపు సన్‌రైజర్స్ హైదరబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌లకిగానూ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొంది.. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌ల్లో తలపడగా.. 10 మ్యాచ్‌ల్లో చెన్నై జట్టు విజయం అందుకుంది. మిగిలిన 4 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలుపొందింది.

Sunrisers Hyderabad: David Warner(c), Jonny Bairstow(w), Kane Williamson, Manish Pandey, Kedar Jadhav, Vijay Shankar, Rashid Khan, Jagadeesha Suchith, Sandeep Sharma, Khaleel Ahmed, Siddarth Kaul

Chennai Super Kings: Ruturaj Gaikwad, Faf du Plessis, Moeen Ali, Suresh Raina, Ambati Rayudu, MS Dhoni(w/c), Ravindra Jadeja, Sam Curran, Shardul Thakur, Lungi Ngidi, Deepak Chahar