IPL 2021 – Ms Dhoni: సీఎస్కే కెప్టెన్‌గా ధోనీకి 200వ మ్యాచ్.. తర్వాత నిషేదం తప్పదా!!

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీకి ఇది 200వ గేమ్. పంజాబ్ కింగ్స్ తో గత శుక్రవారం జరిగిన మ్యాచ్ ..

IPL 2021 – Ms Dhoni: సీఎస్కే కెప్టెన్‌గా ధోనీకి 200వ మ్యాచ్.. తర్వాత నిషేదం తప్పదా!!

ms-dhoni-chennai-super-kings

IPL 2021 – Ms Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీకి ఇది 200వ గేమ్. పంజాబ్ కింగ్స్ తో గత శుక్రవారం జరిగిన మ్యాచ్ లో విజయాన్ని అందుకున్న సీఎస్కేకు కెప్టెన్ ఓ రెండు గేమ్ ల వరకూ దూరం కానున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే సీజన్ లో తాము ఆడిన తొలి మ్యాచ్ లో స్లో బౌలింగ్ ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల కోతను మ్యాచ్ ఫీజు నుంచి కట్టాల్సి ఉంది.

దాని నుంచి జాగ్రత్త పడటానికి రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో జాగ్రత్త పడ్డాడు. 90నిమిషాల్లో వేయించాల్సిన బౌలింగ్ ను 88నిమిషాల్లోనే పూర్తి చేసేశాడు. మరొకసారి అలాగే జరిగినట్లు అయితే ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. రెండు నుంచి నాలుగు గేమ్స్ వరకూ నిషేదించాలి.

ఫైన్ పడిన తర్వాత రెండు గేమ్ లలో మరోసారి స్లో ఓవర్ రేట్ నమోదుకాకుండా కెప్టెన్ జాగ్రత్త పడాలి. పంజాబ్ తో మ్యాచ్ లో మాత్రమే కాకుండా సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లోనూ సమయం కంటే ముందుగా బౌలింగ్ వేయకపోతే నిషేదం తప్పదు మరి.

12.7.3 క్లాజ్ ప్రకారం కొన్ని సందర్భాలలో సమయాన్ని లెక్కించరు.

1. మైదానంలో ఎవరైనా ఆటగాడికి చికిత్స అందిస్తే, ఆ సమయాన్ని బౌలింగ్ కోటా సమయం నుంచి మినహాయిస్తారు.

2. ఎవరైనా ఆటగాడు గాయపడ్డ సందర్భంలో గాయం తీవ్రతను పరిశీలించి మైదానాన్ని వీడనున్న నేపథ్యంలో అందుకుగానూ తీసుకునే సమయాన్ని లెక్కించరు

3. థర్డ్ అంపైర్ నిర్ణయాలు తీసుకునే సమయం. ఆటగాళ్లు తీసుకునే అంపైర్ లేదా ప్లేయర్ రివ్యూలు

4. బ్యాటింగ్ జట్టు తీసుకునే ఎక్స్‌ట్రా టైమ్‌ను బౌలింగ్ కోటా సమయం నుంచి మినహాయిస్తారు

5. ఫీల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం, మంతనాలు జరపడం లాంటివి కాకుండా ఇతరత్రా కారణాలకు వెచ్చించే సమయాన్ని బౌలింగ్ కోటా నుంచి మినహాయిస్తారు.