IPL 2022 : వచ్చే మెగా వేలంలో ఏ ఐపీఎల్ జట్టు, ఏ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకొవచ్చంటే..

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022.. ఫ్యాన్స్ బుర్రలో ఎన్నో ప్రశ్నలు. ఏ టీమ్ లో ఎవరు ఉంటారు? ఏ టీమ్ ఎవరిని రీటైన్ చేసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. రానున్న మెగా వేలానికి ప్రతి టీమ్ డైనమిక్స్ పూర్తిగా మారనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ జట్లు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. గతంలో.. పేపర్ పైన స్ట్రాంగ్ ఫ్రాంచైజీలుగా కనిపించిన జట్లు.. మెగా ఆక్షన్ తర్వాత

IPL 2022 : వచ్చే మెగా వేలంలో ఏ ఐపీఎల్ జట్టు, ఏ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకొవచ్చంటే..

Ipl Team Wise Three Players

IPL 2022 Mega Auction : ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022.. ఫ్యాన్స్ బుర్రలో ఎన్నో ప్రశ్నలు. ఏ టీమ్ లో ఎవరు ఉంటారు? ఏ టీమ్ ఎవరిని రీటైన్ చేసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. రానున్న మెగా వేలానికి ప్రతి టీమ్ డైనమిక్స్ పూర్తిగా మారనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ జట్లు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. గతంలో.. పేపర్ పైన స్ట్రాంగ్ ఫ్రాంచైజీలుగా కనిపించిన జట్లు.. మెగా ఆక్షన్ తర్వాత బలహీనంగా కనిపించాయి. అదే సమయంలో పేపర్ పై బలహీనంగా కనిపించిన ఫ్రాంచైజీలు.. మెగా వేలం తర్వాత బలంగా కనిపించాయి. స్ట్రాంగ్ పెర్ఫ్మారెన్స్ కూడా ఇచ్చాయి.

IPL Auction 2021మెగా ఆక్షన్ విలువ ఏంటో ప్రతి ఐపీఎల్ సపోర్టర్ కి బాగా తెలుసు. దాని వల్ల అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కాగా, ప్రతి ఐపీఎల్ జట్టు.. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు అనే విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో వచ్చే మెగా వేలంలో(2022) ఏ ఐపీఎల్ జట్టు, ఏ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకొవచ్చంటే..

Mumbai Indians

ముంబై ఇండియన్స్…
ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. వచ్చే మెగా వేలంలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలను రీటైన్ చేసుకోవచ్చని అంచనా.

హార్థిక్ పాండ్యా..
హార్థిక్ పాండ్యా కీలక ప్లేయర్ గా మారాడు. మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముంబై ప్లేయర్లలో కీ ప్లేయర్ గా మారాడు. జట్టుని నడిపించే కెప్టెన్సీ లక్షణాలూ ఉన్నాయి. సో, ముంబై జట్టు పాండ్యాను కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది.

రోహిత్ శర్మ…
రోహిత్ శర్మ..ముంబై ఫ్రాంచైజీకి ఎంతో చేశాడు. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. మర్చిపోలేని ప్రదర్శన కనబరిచాడు. ముందుండి మరీ జట్టుని నడిపించాడు. సో, ముంబై జట్టు రోహిత్ శర్మని కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది.

జస్ప్రీత్ బుమ్రా..
2013 నుంచి ముంబై సక్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. డెత్ ఓవర్లలో మ్యాచ్ ని మలుపు తిప్పుతున్నాడు. అమోఘమైన ఫిట్ నెస్ అతడి సొంతం. కొత్త బాల్ తో నిప్పులు చెరుగుతున్నాడు. ప్రపంచంలోని బెస్ట్ బౌలర్లలో ఒక్కడిగా ఉన్నాడు. ముంబై జట్టు.. బుమ్రాను కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది..

Royal Challengers Bangalore

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విషయానికి వస్తే.. వచ్చే మెగా వేలంలో.. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, యజువేంద్ర చాహల్ ని రీటైన్ చేసుకోవచ్చు…

విరాట్ కోహ్లి..
ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లి బెంగళూరు తరుఫున ఆడుతున్నాడు. ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్ మెన్. ఫ్రాంచైజీ అంటే తనకు ఎంత ముఖ్యమో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. బెంగళూరు జట్టుకి కెప్టెన్ గా విరాట్ కొనసాగుతాడని 100శాతం చెప్పొచ్చు…

ఏబీ డివిలియర్స్:
ఇక..బెంగళూరు రిటైన్ చేసుకునే మరో క్రికెటర్ అబ్రహం బెంజమిన్ డివిలియర్స్. మోస్ట్ ఎంటర్ టైనింగ్ బ్యాట్స్ మెన్, ఆధారపడ్డ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అనేక సందర్భాల్లో ఓటమి అంచుల నుంచి జట్టుని విజయతీర్చాలకు చేర్చిన ఘనత డివిలియర్స్ ది.

యజువేంద్ర చాహల్..
ఆర్సీబీలో ఇతర బౌలర్లు ఫెయిల్ అయినా.. చాహల్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. జట్టులో క్రూషియల్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. అమేజింగ్ ప్రదర్శన ఇచ్చాడు. ఇతర బౌలర్లతో పోలిస్తే..స్థిరంగా రాణిస్తున్నాడు.

Chennai Super Kings

చెన్నై సూపర్ కింగ్…
చెన్నై సూపర్ కింగ్స్.. విషయానికి వస్తే.. వచ్చే మెగా వేలంలో ఎంఎస్ ధోని, సురేష్ రైనా, సామ్ కరణ్ లను రీటైన్ చేసుకోవచ్చని అంచనా.

ఎంఎస్ ధోని..
ఈ సీజన్ తర్వాత ఎంఎస్ ధోని రిటైర్ అవుతాడా లేదా అన్నది స్పష్టత లేదు. అయితే మరికొన్నేళ్లు ఐపీఎల్ కు ఆడతాడని క్రికెట్ వర్గాల సమాచారం. నెక్ట్స్ సీజన్ కి కూడా ధోని అందుబాటులో ఉంటే.. సీఎస్ కే జట్టు కచ్చితంగా ధోనిని రిటైన్ చేసుకుంటుంది. సీఎస్ కే జట్టుకి మరో పేరుగా ధోని మారాడు.

సురేష్ రైనా..
సురేష్ రైనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా విలువైన ఆటగాడు. ఐపీఎల్ లో 5వేల పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్స్ లో విరాట్ కోహ్లికి పోటీ ఇస్తున్నాడు. రైనాని సీఎస్ కే రీటైన్ చేసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

సామ్ కరణ్…
సీఎస్ కే రిటైన్ చేసుకునే ముగ్గురు ఆటగాళ్లలో సామ్ కరణ్ పేరు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, అన్ని ఫార్మాట్లలో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఫ్యూచర్ సూపర్ స్టార్ గా అతడిని చెప్పుకుంటున్నారు. సీఎస్ కే జట్టులోని బెస్ట్ ఆటగాళ్లలో సామ్ ఒకడు. సీఎస్ కే అతడిపై ఎంతో నమ్మకం ఉంచింది.

Delhi Capitals

ఢిల్లీ కేపిటల్స్..
ఢిల్లీ కేపిటల్స్ జట్టు విషయానికి వస్తే.. రానున్న మెగా వేలంలో.. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడాలను రిటైన్ చేసుకోవచ్చు..

శ్రేయస్ అయ్యర్…
ప్లేయర్ గా, కెప్టెన్ గా ఢిల్లీ కేపిటల్స్ జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు. గౌతమ్ గంభీర్ నుంచి కెపెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. 2018 ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. గాయం కారణంగా 2021 ఎడిషన్ పూర్తిగా మిస్ అయినప్పట్టికి.. రానున్న మెగా ఆక్షన్ లో ఢిల్లీ జట్టు.. శ్రేయస్ అయ్యర్ పై పూర్తి నమ్మకం ఉంచింది.

రిషబ్ పంత్..
ప్రస్తుత ప్రపంచ క్రికెటర్లలో ఎక్కువగా మాట్లాడుకుంటున్న ఆటగాడు. గడిచిన కొన్ని నెలలుగా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. శ్రేయర్ అయ్యర్ లేని సమయంలో ఢిల్లీ కేపిటల్స్ బ్యాటింగ్ లైనప్ లో బ్యాక్ బోన్ గా మారాడు. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ గా ఉన్నాడు. రానున్న సీజన్ లోనూ కచ్చితంగా ఢిల్లీ కేపిటల్స్ తరుఫున ఆడనున్నాడు.

కగిసో రబాడా..
రబాడా రాకతో ఢిల్లీ కేపిటల్స్ జట్టు బౌలింగ్ లో మరింత రాటుదేలింది. 2020 ఎడిషన్ లో లీడింగ్ వికెట్ టేకర్. 2019 ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానం. ఢిల్లీ కేపిటల్స్ ఎట్టి పరిస్థితుల్లో రబాడాను వదులుకోదు.

 

Punjab Kings

పంజాబ్ కింగ్స్…
పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మహమ్మద్ షమీలను రిటైన్ చేసుకునే చాన్సుంది.

కేఎల్ రాహుల్…
పంజాబ్ జట్టులో జాయిన్ అయినప్పటి నుంచి తనలోని మరో కోణాన్ని చూపించాడు. ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ చేయని మ్యాచ్ ఒకటో రెండో ఉండొచ్చు. మరికొన్నేళ్లు అతడు పంజాబ్ జట్టుకి సారథ్యం వహించనున్నాడు. కచ్చితంగా పంజాబ్ జట్టు రిటైన్ చేసుకుంటుంది.

మయాంక్ అగర్వాల్…
అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ లో పాటు ప్రపంచ క్రికెట్ లో సరికొత్త ఎత్తుకి ఎదిగాడు. భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. లాస్ట్ సీజన్ లో 38 యావరేజ్ తో 156.45 స్ట్రైక్ రేట్ తో 424 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు రిటైన్ చేసుకునే ముగ్గురు ప్లేయర్లలో మయాంక్ అగర్వాల్ ఉండే చాన్సుంది.

మహ్మద్ షమీ…
ఐపీఎల్ లో మంచి బౌలర్ గా గుర్తింపు పొందాడు. వికెట్లు తియ్యగల సత్తా ఉంది. తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లోనూ హ్యాండిల్ చేయగల నేర్పు ఉంది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో స్టార్ బౌలర్ గా ఎదిగాడు. బౌలింగ్ యూనిట్ అతడి చుట్టూ తిరుగుతుంది. పంజాబ్ జట్టు ఎట్టి పరిస్థితుల్లో అతడిని వదులుకోదు.

Kolkata Knight Riders

కోల్ కతా నైట్ రైడర్స్..
కోల్ కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. శుభమన్ గిల్, ఆండ్రూ రస్సెల్, పాట్ కమిన్స్ ని రిటైన్ చేసుకునే చాన్సుంది.

శుభమన్ గిల్..
గిల్.. టీమిండియాకే కాదు కోల్ కతా నైట్ రైడర్స్ కి కూడా ఫ్యూచర్. కేకేఆర్ జట్టులో స్థిరంగా రాణిస్తున్న బ్యాట్స్ మెన్. తనకు సూట్ కాని పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. గిల్ విజృంభించాడు అంటే.. ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. ఈ విషయం కేకేఆర్ కి బాగా తెలుసు. కోల్ కతా రిటైన్ చేసుకునే ముగ్గురు ఆటగాళ్లలో కచ్చితంగా గిల్ ఒకడు. అంతేకాదు కెప్టెన్ కూడా.

ఆండ్రూ రస్సెల్..
గొప్ప టీ20 ఆటగాళ్లలో రస్సెల్ ఒకడు. విధ్వంసకర బ్యాటింగ్ తో ఒంటి చేత్తో జట్టుని గెలిపించగల సత్తా ఉంది. అంతేకాదు జట్టులో లీడింగ్ బౌలర్లలో ఒకడు. జట్టులో విలువైన ప్లేయర్లలో రస్సెల్ ఒకడు. వీలైనన్ని సంవత్సరాలు..అతడిని అట్టిపెట్టుకుని ఉండటానికి కేకేఆర్ చూస్తుంది.

పాట్ కమిన్స్…
ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్లలో ఒకడు. భారీ ధరకు(రూ.15.5 కోట్లు) కేకేఆర్ కొనుక్కుంది. పరిమిత ఓవర్ల మ్యాచుల్లో మంచి బౌలర్ కానప్పట్టికి.. క్రమంగా తన ప్రదర్శనను మెరుగుపరుచుకున్నాడు. కేకేఆర్ జట్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇతడి మీద ఇన్వెస్ట్ చేసేందుకు ఫ్రాంచైజీ ఆసక్తి చూపిస్తుంది.

Sunrisers Hyderabad

సన్ రైజర్స్ హైదరాబాద్…
సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే..డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ లను రిటైన్ చేసుకునే చాన్సుంది.

డేవిడ్ వార్నర్..
హైదరాబాద్ జట్టుకి ఎంత చేశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ లో ప్రత్యేకమైన బ్యాట్స్ మెన్. ఏనాడు నిరాశపరచలేదు. అద్భుతమైన ప్రదర్శనలు ఎన్నో ఇచ్చాడు. వరుస ఓటములు జట్టు సభ్యులను డీలా పరిచినప్పుడు.. వార్నర్ ముందుండి నడిపించాడు. హైదరాబాద్ కి ఓ పెద్ద అసెట్ అయిన వార్నర్ ను ఆ జట్టు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు.

రషీద్ ఖాన్..
కొన్నేళ్లుగా పర్పుల్ జట్టుకి ఆడుతున్న స్పిన్నర్లలో ఒకడు. చాలా కష్టమైన బౌలర్. ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాళ్లను ఔట్ చేసే సత్తా ఉంది. రషీద్ కి కేవలం 22ఏళ్లే. రానున్న పదేళ్ల పాటు రషీద్ ను హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

భువనేశ్వర్ కుమార్..
అవసరమైన సమయాల్లో తన సత్తా ఏంటో చూపించాడు. ఫార్మాట్ ఏదైనా.. కొత్త బాల్ వేసే బౌలర్లలో బెస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందాడు. ప్రత్యర్థి జట్టులో అనేకసార్లు తొలి వికెట్ తీసిన ఘతన బువీ సొంతం. అది భారత జట్టు తరుఫు కావొచ్చు, ఐపీఎల్ కావొచ్చు. బువీ గాయాల బారిన పడకపోతే, కచ్చితంగా హైదరాబాద్ జట్టు అతడిపై నమ్మకం ఉంచుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా చాలా కామ్ గా ఉంటాడు. పైగా అపారమైన అనుభం ఉంది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ కచ్చితంగా బువీని రిటైన్ చేసుకుంటుంది.

Rajasthan Royals

రాజస్తాన్ రాయల్స్..
రాజస్తాన్ రాయల్స్ విషయానికి వస్తే.. సంజూ శాంసన్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ ని వచ్చే మెగా ఆక్షన్ లో రిటైన్ చేసుకునే చాన్సుంది.

సంజూ శాంసన్..
అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకి కెప్టెన్ ని చేసి అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఇదొక క్లియర్ ఇండికేషన్. అతడి సారధ్యంలోనే జట్టుని ముందుకు తీసుకెళ్లాలని యాజమాన్యం భావిస్తోంది.

జోస్ బట్లర్…
ప్రపంచంలోనే బెస్ట్ టీ20 బ్యాట్స్ మెన్లలో ఒకడు. అంతేకాదు అద్భుతమైన వికెట్ కీపర్ కూడా. జట్టులో విలువైన ఆటగాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు.. బ్యాటింగ్ పొజిషన్ లో అనేకసార్లు బట్లర్ ని మార్చింది. పొజిషన్ ఏదైనా.. బెస్ట్ ప్రదర్శన ఇచ్చాడు. బట్లర్ ను రిటైన్ చేసుకోవడం రాజస్తాన్ రాయల్స్ కు ఎంతో బెనిఫిట్ అవుతుంది.

బెన్ స్టోక్స్…
అతడి పేరే ఓ విలువను సూచిస్తుంది. ఫెంటాస్టిక్ బ్యాట్స్ మెన్, క్వాలిటీ పేసర్, ఔట్ స్టాండింగ్ ఫీల్డర్.. ఒక్క మాటలో స్టోక్స్ గురించి చెప్పాలంటే.. బెస్ట్ ఆల్ రౌండర్. అయితే ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ టీమ్ తరుఫున ఇంతవరకు బెస్ట్ ప్రదర్శన చూపలేదు. అయినప్పటికి స్టోక్స్ ను రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ.