MI vs RCB : టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్‌ కోహ్లీ

ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలైంది. తొలి పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడేందుకు సిద్ధమయ్యాయి.

MI vs RCB : టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్‌ కోహ్లీ

Mi Vs Rcb Rcb Chose To Field, Season First Match 2021 (1)

MI vs RCB : ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలైంది. తొలి పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడేందుకు సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ముంబై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి.

ఆరంభ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు 5 సార్లు టైటిల్‌ సొంతం చేసుకుంది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రతిసారి తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది.


ఈసారి కూడా సెంటిమెంట్‌ను ఫాలో అవుతుందో లేదా గెలుపు సాధిస్తుందో లేదో… రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు యుజువేంద్ర చాహల్‌కు వందో ఐపీఎల్‌ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌ అతడికి గుర్తుండిపోవాలని ఆర్సీబీ ఆశిస్తోంది. చాహల్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ముంబైని ఎలా ఆడుకుంటాడో చూడాలి.


ముంబై ఇండియన్స్‌ జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌, మార్కో జెన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు:
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్, డేనియెల్‌ క్రిస్టియన్, వాషింగ్టన్‌ సుందర్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌