IPL 2021: చెన్నై Vs ముంబై మ్యాచ్‌లో బద్ధలైన రికార్డులు

హోరాహోరీగా సాగిన పోరాటాలెన్నో చూశాం. ఆఖరి బంతికి, సూపర్ ఓవర్లకు తేలిన ఫలితాలు వీక్షించాం. కానీ, భయంకరంగా..

IPL 2021: చెన్నై Vs ముంబై మ్యాచ్‌లో బద్ధలైన రికార్డులు

Ipl 2021

IPL 2021: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చాలా హైలెట్ మ్యాచ్‌లు చూశాం. హోరాహోరీగా సాగిన పోరాటాలెన్నో చూశాం. ఆఖరి బంతికి, సూపర్ ఓవర్లకు తేలిన ఫలితాలు వీక్షించాం. కానీ, భయంకరంగా రెచ్చిపోయిన అంబటి రాయుడు, విధ్వంసం సృష్టించిన కీరన్ పొలార్డ్ ఇన్నింగ్స్ లు చూశారా..

ఢిల్లీ వేదికగా జరిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ వర్సెస్ ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో ఇదే అద్భుతం జరిగింది. చరిత్రలో అత్యంత గొప్ప మ్యాచుల్లో ఒకటిగా నిలిచిపోయే గేమ్ అలా ముగిసింది. బౌండరీలు, సిక్సర్ల వరద పారిన ఈ హోరాహోరీ పోరులో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

* మొదట చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ముంబైపై చెన్నైకి ఇదే హైయ్యస్ట్ స్కోరు.

* భారీ టార్గెట్‌ను ముంబై చివరి బంతికి ఛేదించింది. 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక విజయవంతమైన చేజింగ్. ముంబై చేసిన హైయ్యస్ట్ ఛేజింగ్ ఇదే కావడం గమనార్హం.

* అంబటి రాయుడు (72*; 27 బంతుల్లో ) మొదట అజేయంగా నిలిచాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. చెన్నై తరఫున ఇది మూడో అత్యధిక వేగవంతమైన హాఫ్ సెంచరీ.

* అంతకు ముందు 2014లో పంజాబ్‌పై రైనా 16 బంతుల్లో, 2012లో బెంగళూరుపై ఎంఎస్‌ ధోనీ 20 బంతుల్లో నమోదు చేశారు.

* ఐపీఎల్‌ మ్యాచుల్లో బుమ్రా ఎక్కువ పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. 4 ఓవర్ల కోటా వేసి 56 పరుగులు ఇచ్చాడు. 2015లో ఢిల్లీపై 55, అదే ఏడాది బెంగళూరుపై 52, 2017లో గుజరాత్‌పై 45 పరుగులు ఇవ్వడం గమనార్హం.

* సక్సెస్‌ఫుల్ చేజింగ్‌లో ఆఖరి 10 ఓవర్లలో చేసిన అత్యధిక పరుగులు 138. సీఎస్‌కేపై ముంబై చేసింది. పొలార్డ్‌ (87*; 34 బంతుల్లో) ఊచకోతే ఇందుకు కారణం.

* 2019లో పంజాబ్‌పైనా ముంబై 133 పరుగులు చేసింది. అప్పుడూ పొలార్డే 31 బంతుల్లో 83 బాదేశాడు. 2013లో బెంగళూరుపై పంజాబ్‌ 126 పరుగులు చేయడం గమనార్హం.

* ఈ మ్యాచులో మొత్తం 30 సిక్సర్లు, 30 బౌండరీలు నమోదయ్యాయి. మొత్తం 40 ఓవర్లు ఆట సాగితే 10 ఓవర్లు బౌండరీలే బాదడం ప్రత్యేకం.

* చెన్నై 16 సిక్సర్లు, 14 బౌండరీలు బాదగా ముంబై 14 సిక్సర్లు, 16 బౌండరీలు కొట్టింది.