IPL Fraud: ఐపీఎల్ ఫ్రాంచైజీలో చోటు కోసం రూ.30లక్షలు

ఐపీఎల్ టీమ్ లో చోటిప్తిస్తామని 18ఏళ్ల క్రికెటర్ కుటుంబాన్ని మోసం చేశారు ముగ్గురు వ్యక్తులు. ఐపీఎల్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ లో...

IPL Fraud: ఐపీఎల్ ఫ్రాంచైజీలో చోటు కోసం రూ.30లక్షలు

Promised A Place In Ipl Team Teenager Cheated Of Rs 30 Lakh

IPL Fraud: ఐపీఎల్ టీమ్ లో చోటిప్తిస్తామని 18ఏళ్ల క్రికెటర్ కుటుంబాన్ని మోసం చేశారు ముగ్గురు వ్యక్తులు. ఐపీఎల్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ లో చోటు కావాలంటే రూ.30లక్షలు చెల్లించాలని చెప్పారు. బాధిత కుటుంబం ఆజాద్ మైదాన్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

క్రికెటర్ తండ్రి మైక్రో ఫైనాన్స్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. ములుంద్ లో నివాసముంటున్న వ్యక్తి లోకల్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రీసెంట్ గా అతను కర్ణాటక స్పోర్ట్స్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. వారానికి రెండు సార్లు ప్రాక్టీస్ కు వెళ్తూ ఉన్నాడు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తూ ఓ క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు పుష్కర్ తివారీ అనే వ్యక్తిని కలిశాడు. మహారాష్ట్ర టీంకు ట్రై చేయొద్దని చాలా కాంపిటీషన్ ఉందని చెప్పాడు. ఇతర రాష్ట్రాల తరపున ఆడితే కాంపిటీషన్ తకకువగా ఉంటుందని సూచించాడు.

ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. మార్చిలో ఒకసారి ఫోన్ చేసి ఒక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీకి కేకేఆర్ లో బౌలర్ అవసరముందని తెలిసిందని ఆఫర్ చేశాడు.

ఆ టీనేజ్ క్రికెటర్ తండ్రి తివారీని సంప్రదించాడు. ఫోన్లో ఆ టీం మేనేజ్మెంట్ తో మాట్లాడాడు. స్క్వాడ్ డెవలప్ చేస్తున్నామని అయితే అందులో వేకెన్సీ ఉందని రూ.30లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు.

బాయ్ భవిష్యత్ క్రికెట్ లోనే అని ఊహించిన ఆ కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆ రూ.30లక్షల అమౌంట్ ను రెండు ఇన్ స్టాల్మెంట్లలో చెల్లించారు. ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యే ఐపీఎల్ కు రూ.10లక్షల అగ్రిమెంట్ ఉంటుందని చెప్పారు.

డబ్బులు తీసుకున్న తర్వాత కాల్స్ కు రెస్పాన్స్ ఇవ్వడం మానేశారు. ఆ కుటుంబం అనుమానాస్పదంగా భావించి మోసపోయామని రియలైజ్ అయి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ ఓనర్, తివారీలపై కేసు రిజిష్టర్ చేయించారు.