RR Vs PBKS IPL 2021 : ఇదీ కదా మ్యాచ్ అంటే.. పోరాడి ఓడిన రాజస్తాన్ రాయల్స్.. సెంచరీతో రాణించిన సంజూ.. బోణీ కొట్టిన పంజాబ్

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది.

RR Vs PBKS IPL 2021 : ఇదీ కదా మ్యాచ్ అంటే.. పోరాడి ఓడిన రాజస్తాన్ రాయల్స్.. సెంచరీతో రాణించిన సంజూ.. బోణీ కొట్టిన పంజాబ్

Punjab Kings Beat Rajasthan Royals

RR Vs PBKS IPL 2021 Punjab Beat Rajasthan : ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. రాజస్తాన్ రాయల్స్ జట్టు 20ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. సెంచరీతో అదరగొట్టాడు. జట్టుని విజయతీరాల వరకు తీసుకెళ్లాడు. కానీ, ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా.. ఔటయ్యాడు. మ్యాచ్ లో చివరి బంతికి సంజూ వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 12ఫోర్లు ఉన్నాయి. రాజస్తాన్ ఓడినా.. సంజూ తన బ్యాటింగ్ బీభత్సం సృష్టించాడు. ఒకానొక సమయంలో రాజస్తాన్ గెలుపు ఖాయం అని అంతా అనుకున్నాడు.

sanju

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ చేసింది. 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

kl rahulముందుండి జట్టుని నడిపించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన రాహుల్.. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను ఆడుకున్నాడు. 50 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. జస్ట్ లో సెంచరీ మిస్ అయ్యాడు. రాహుల్ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెల్చిన రాజస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ బౌలర్లలో చేతర్ సకారియా 3వికెట్లు, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు. పంజాబ్ బౌలర్లలో ఆర్ష్ దీప్ సింగ్ 3, షమీ 2 వికెట్లు తీశారు.

స్కోర్లు
పంజాబ్-221/6
రాజస్తాన్ 217/7

సంజూ శాంసన్-63 బంతుల్లో 119 పరుగులు(7సిక్సులు, 12 ఫోర్లు)
కేఎల్ రాహుల్-50 బంతుల్లో 91 పరుగులు(5 సిక్సులు, 7ఫోర్లు)