PBKS vs RCB : రాహుల్ మెరుపు ఇన్నింగ్స్, చతికిలపడిన రాయల్ ఛాలెంజర్

ఐపీఎల్ 2021 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ అదరగొట్టాడు. రాయల్ ఛాలెంజర్ జట్టుపై 34 రన్లతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.

PBKS vs RCB  : రాహుల్ మెరుపు ఇన్నింగ్స్, చతికిలపడిన రాయల్ ఛాలెంజర్

Ipl 2021

IPL  2021 : ఐపీఎల్ 2021 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ అదరగొట్టాడు. రాయల్ ఛాలెంజర్ జట్టుపై 34 రన్లతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. బ్యాట్ తో రాయల్ ఛాలెంజర్ జట్టుకు రాహుల్ చుక్కలు చూపించాడు. వికెట్లు పడుతున్నా క్రీజులో పాతుకపోయి..మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 91 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.

అనంతరం 180 పరుగుల లక్ష్య చేధనకు దిగిన రాయల్ ఛాలెంజర్ బాట్స్ మెన్స్ కు పంజాబ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఏ మాత్రం వారికి అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ కోహ్లీ 35, పాటిదార్ 31 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగతా బ్యాట్స్ మెన్స్ సింగిల్ స్కోరుకే పరిమితమయ్యారు. చివరిలో వచ్చిన పటేల్ 31 పరుగులు చేయగలిగారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 145 పరుగులు చేసింది.

ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టులో రాహుల్‌(91 నాటౌట్‌: 57 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు ) రాణించడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. క్రిస్‌గేల్‌ 24 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఆఖర్లో వచ్చిన హర్‌ప్రీత్‌ బ్రార్‌ 25 పరుగులు చేశాడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్‌ కనీసం క్రీజులో నిలవలేకపోయారు. ప్రభు సిమ్రాన్‌ సింగ్‌ (7), నికోలస్‌ పూరన్‌ (0), దీపక్‌ హుడా(5), షారుక్‌ ఖాన్‌ (0) నిరాశపరిచారు. రాహుల్‌ ఒంటరి పోరాటం చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు.

పంజాబ్ జట్టులో :  హర్ ప్రీత్ బార్ 3, రవి బిష్ణోయ్ 2, రిలే మెరిడిత్ ఒక వికెట్, జోర్దాన్ ఒక వికెట్, షమీ ఒక వికెట్ తీశారు.
బెంగళూరు జట్టులో :  జేమీసన్‌ రెండు వికెట్లు తీయగా డేనియల్‌ సామ్స్‌, యుజువేంద్ర చాహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలో వికెట్ పడగొట్టారు.

Read More : Covid-19 Telangana : తెలంగాణలో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ ఉండదు