IPL 2021 RR Vs DC : కోట్లు కుమ్మరించి కొన్న క్రిస్ కుమ్మేశాడు, ఢిల్లీపై రాజస్తాన్ అనూహ్య విజయం

ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు ఘన విజయం సాధించింది. కోట్లు కుమ్మరించి కొన్న క్రిస్ మోరిస్.. ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు. మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్ జట్టు విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ కేపిటల్స్.. నిర్ణీత ఓవర్లలో

IPL 2021 RR Vs DC : కోట్లు కుమ్మరించి కొన్న క్రిస్ కుమ్మేశాడు, ఢిల్లీపై రాజస్తాన్ అనూహ్య విజయం

Rajasthan Royals Beat Delhi Capitals

ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ ఐపీఎల్ లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు, కోట్లు కుమ్మరించి మరీ రాజస్తాన్ కొన్న క్రిస్ మోరిస్.. ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు. తన సత్తా ఏంటో చూపాడు. 18 బంతుల్లోనే 36 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్ ని మలుపు తిప్పింది క్రిస్ మోరిస్ అనే చెప్పాలి.

morris

మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్ జట్టు విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ కేపిటల్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. జయదేవ్ ఉనద్కత్ నిప్పులు చెరిగాడు. రాజస్తాన్ బౌలర్ల ధాటికి ఢిల్లీ విలవిలలాడింది. లో స్కోర్ కే పరిమితం అయ్యింది.

chris

అనంతరం 148 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే.. 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. 19.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. రాజస్తాన్ జట్టులో డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 43 బంతుల్లో 62 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేదు. టఫ్ టైమ్ లో క్రీజులోకి వచ్చిన ఐపీఎల్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ప్లేయర్ క్రిస్ మోరిస్ తన సత్తా చూపించాడు. ధాటిగా ఆడి జట్టుకి విజయాన్ని అందించాడు. ఢిల్లీ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. రబాడా, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.

రాజస్తాన్ ను గెలిపించిన మిల్లర్, మోరిస్:
రాజస్తాన్ జట్టులో డేవిడ్‌ మిల్లర్‌(62; 43 బంతుల్లో 7×4, 2×6), క్రిస్‌ మోరిస్‌(36*; 18 బంతుల్లో 4×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరమైన వేళ మోరిస్‌ రెండు సిక్సర్లతో చెలరేగి రాజస్థాన్‌కు అనూహ్య విజయం అందించాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ టీమ్‌ తొలుత ఘోరంగా తడబడింది. 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు బట్లర్‌(2), వోహ్రా(9)తో పాటు కెప్టెన్‌ సంజూ శాంసన్‌(4), శివమ్‌దూబె(2), రియాన్‌ పరాగ్‌(2) ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు.

రాజస్తాన్ గెలుపుపై సందేహాలు:
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మిల్లర్.. రాహుల్‌ తెవాతియా(19)తో కలిసి‌ ఆరో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడే క్రమంలో స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దాంతో రాజస్థాన్‌ విజయంపై సందేహాలు మొదలయ్యాయి. చివర్లో ఉనద్కత్‌(11*)తో కలిసి మోరిస్‌ సిక్సర్లతో విరుచుకుపడి రాజస్థాన్‌కు ఈ సీజన్ లో తొలి విజయాన్ని ఖరారు చేశాడు.

నిప్పులు చెరిగిన ఉనద్కత్:
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులే చేసింది. నిప్పులు చెరిగే బంతులతో జయదేవ్‌ ఉనద్కత్‌ (3/15) ఆదిలోనే ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. అతడి ధాటికి ఓపెనర్లు పృథ్వీషా(2), శిఖర్‌ ధావన్‌(9)తో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానె(8) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఆపై కెప్టెన్‌ రిషభ్‌పంత్‌(51; 32 బంతుల్లో 9×4) హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నాడు.

ఒక్క సిక్సర్ కూడా లేదు:
చివర్లో లలిత్‌ యాదవ్‌(20), టామ్‌కరన్‌(21), క్రిస్‌వోక్స్‌(15*), రబాడ(9*) తలా ఓ చేయి వేయడంతో రాజస్థాన్‌ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. రాజస్థాన్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 2, క్రిస్‌మోరిస్‌ ఒక వికెట్‌ తీశారు. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ కూడా సిక్సర్ బాదకపోవడం గమనార్హం. దీంతో ఈ సీజన్‌లో వాంఖడే స్టేడియంలో ఒక్క సిక్సర్‌ ఇవ్వని జట్టుగా రాజస్థాన్‌ కొత్త రికార్డు నెలకొల్పింది.

ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డ్:
కాగా, ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఐపీఎల్ 2021 సీజన్ లో క్రిస్ ను రాజస్థాన్ రాయల్స్ రూ. 16.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి. రూ. 75 లక్షల బేస్ ప్రైస్ తో క్రిస్ వేలం పాటలోకి వచ్చాడు. అతన్ని సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడటంతో… చివరకు కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు.

క్రిస్ మోరిస్ కంటే ముందు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఐపీఎల్ 2020లో కమిన్స్ రూ. 15.5 కోట్ల ధర పలికాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మరియు లోయర్ ఆర్డర్ హిట్టర్ అయిన క్రిస్ మోరిస్ ఇప్పటి వరకు 70 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 157.87 స్ట్రైక్ రేట్ తో 551 పరుగులు చేశాడు. 80 వికెట్లను పడగొట్టాడు.