RCB vs KKR : చతికిలపడిన కోల్ కతా..బెంగళూరు విజయం

ఐపీఎల్ 2021లో కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.

RCB vs KKR : చతికిలపడిన కోల్ కతా..బెంగళూరు విజయం

Ipl 2021 Kkr

 IPL 2021 : ఐపీఎల్ 2021లో కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. బెంగళూరు జట్టు నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోలేక కోల్ కతా బ్యాట్స్ మెన్స్ చతికిలపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏ ఒక్క బ్యాట్స్ మెన్స్ పోరాటం చేయలేదు. తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. పరుగులు చేయకుండా కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ప్రధానంగా…కేల్ జేమిసన్ మూడు వికెట్లు తీశాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. 205 పరుగులను చేధించాలనే లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే దెబ్బలు తగిలాయి. రాణా (18), గిల్ (21), త్రిపాఠి (25), మోర్గాన్ (29) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. జట్టు స్కోరు 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. రస్సెల్ కొద్దిగా ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కార్తీక్ (2), హసన్ (26), కమిన్స్ (6) పరుగులు మాత్రమే చేయగలిగారు. రస్సేల్ (31) రన్లు చేసి చివరిలో అవుట్ అయ్యాడు. హర్బజన్ సింగ్ 2, చక్రవర్తి 2 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో 8 వికెట్లు కోల్పోయి…166 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే…మాక్స్ వెల్, డివిలియర్స్ దుమ్మురేపారు. హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో భారీ స్కోరు సాధించింది. ఐదో బ్యాట్స్ మెన్ గా వచ్చిన డివిలియర్స్ కేవలం 34 బంతులను ఎదుర్కొని..76 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం విశేషం. 49 బంతులను ఆడిన మాక్స్ వెల్ 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ (5) నిరాశపరచగా..పడిక్కల్ (25), పాటిదార్ (1) పరుగులు మాత్రమే చేయగలిగారు. జేమిసన్ 11 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 204 రన్లు చేసింది. 38 పరుగులతో బెంగళూరు జట్టు విజయం సాధించింది.

బెంగళూరు జట్టులో చాహల్ 2, కైల్ జేమిసన్ 3, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్, పాటిల్ 2 వికెట్లు తీశారు.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో చక్రవర్తి 2, కమిన్స్ 1, ప్రసిద్ధ్ 1 వికెట్ తీశారు.

Read More : RCB vs KKR : కష్టాల్లో కోల్ కతా నైట్ రైడర్స్, 75 పరుగులు..నాలుగు వికెట్లు