Sanju Samson: సంజూ శాంసన్ కెప్టెన్‌గా నయా రికార్డ్

కెప్టెన్‌గా తొలి సీజన్ ఆడుతున్న సంజూ శాంసన్ క్రీజులో పాతుకుపోయి.. చివరి వరకూ ఆడి సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్‌గా సెంచరీ నమోదు చేసి..

Sanju Samson: సంజూ శాంసన్ కెప్టెన్‌గా నయా రికార్డ్

Sanju Samson

Sanju Samson: కెప్టెన్‌గా తొలి సీజన్ ఆడుతున్న సంజూ శాంసన్ క్రీజులో పాతుకుపోయాడు. చివరి వరకూ ఆడి సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్‌గా సెంచరీ నమోదు చేసిన తొలి ప్లేయర్ కూడా శాంసన్. 54బంతుల్లోనే 100పరుగులు పూర్తి చేశాడు. ముంబై వేదికగా సోమవారం విధ్వంసం సృష్టించాడు.

జట్టు ఓడినా శాంసన్ ఇన్నింగ్స్ మాత్రం గుర్తుండిపోయేలా ఉంది. కేవలం 33బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకోగలిగాడు. కాకపోతే ఈ మ్యాచ్ లో సంజూకు రెండు లైఫ్ లు దొరికాయి. ఒకటి 12 పరుగుల వద్ద కేఎల్ రాహుల్, 35పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ లు క్యాచ్ లు వదిలేయడం.

మొత్తంగా 63బంతుల్లోనే 12ఫోర్లు, 7సిక్సులతో చెలరేగాడు. అంత శ్రమించినా రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించలేకపోయాడు. 54 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఆ సమయానికి అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 14 ఫోర్లు ఉన్నాయి. భారీ టార్గెట్ లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగింది. సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముందుండి జట్టుని నడిపించాడు. భారీ టార్గెట్ చివరి బంతికి ముందు జట్టుఇంకా 4పరుగులు చేయాల్సి ఉండగానే మ్యాచ్ ముగిసింది. 119పరుగుల వద్ద శాంసన్ అవుట్ అయ్యాడు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. రాజస్తాన్ రాయల్స్ జట్టు 20ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు మాత్రమే చేసింది.