SRH vs DC IPL 2021 : ఉత్కంఠపోరులో ఢిల్లీదే విజయం.. సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి

ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలిచింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ రేపిన పోరులో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్‌ను ఢిల్లీ ఓడించింది.

SRH vs DC IPL 2021 : ఉత్కంఠపోరులో ఢిల్లీదే విజయం.. సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి

Delhi Capitals Beat Sunrisers Hyderabad In Super Over

SRH vs DC IPL 2021 : ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలిచింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ రేపిన పోరులో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్‌ను ఢిల్లీ ఓడించింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ఆడించగా.. ముందుగా హైదరాబాద్‌ 7 పరుగులు చేసింది. చివరి బంతికి వార్నర్‌ రెండు పరుగులు తీసినా.. బ్యాట్‌ను క్రీజులో సరిగా పెట్టలేదు. ఛేదనలో ఢిల్లీ ఆఖరి బంతికి విజయం సాధించింది.

ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (53; 39 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఛేదనలో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (66 నాటౌట్‌; 51 బంతుల్లో 8ఫోర్లు) వీరోచితంగా పోరాడినా సన్ రైజర్స్ గెలువలేకపోయింది.

మందకొడి పిచ్‌పై ఛేదనలో ఆరంభంలోనే హైదరాబాద్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. వార్నర్ (6)కు చేతులేత్తేశాడు. మరో ఓపెనర్ బెయిర్‌స్టో (38; 18 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సులు) నమోదు చేశాడు. అక్షర్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ దంచిన అతడు.. అవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లోనూ బంతిని బౌండరీ తరలించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో బెయిర్ స్టో దూకుడుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన విలిమయ్సన్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు.

కేదార్‌ జాదవ్‌ (9), అభిషేక్ శర్మ (5), విజయ్ శంకర్ (8) చేయగా.. సుచిత్‌ (14 నాటౌట్‌), విలిమయ్సన్ (66)తో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. చివరిలో మూడు బంతులకు 3 పరుగులే రావడంతో మ్యాచ్‌ టై అయింది. ఢిల్లీ బౌలర్లలో అవేష్ ఖాన్ మూడు వికెట్లు పడకొట్టగా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు, అమిత్ మిశ్రా ఒక వికెట్ తీసుకున్నాడు. సైన్ రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పృథ్వీషాకు దక్కింది.