IPL 2021 SRH Vs RCB : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

IPL 2021 SRH Vs RCB : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

Ipl 2021 Srh Vs Rcb

IPL 2021 SRH Vs RCB : ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. తొలి మ్యాచ్ లో ముంబైపై గెలిచిన ఆర్సీబీ రెండో మ్యాచ్ లోనూ గెలుస్తామని ధీమాగా ఉంది. కోల్‌కతా చేతిలో మొదటి మ్యాచ్ లో ఓటమిపాలైన హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌లు, రాయల్ ఛాలెంజర్స్ 7మ్యాచ్‌లలో గెలిచింది.

చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుండగా.. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు అనుకూలంగా మార్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ స్పిన్ విభాగం బలహీనంగా ఉంది. అలాగే వార్నర్ బెంగళూరుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకరు. హైదరాబాద్ తరఫున వార్నర్ రాయల్ ఛాలెంజర్స్‌పై అత్యధికంగా 593 పరుగులు చేయగా.. హైదరాబాద్‌పై అత్యధిక 531 పరుగులు చేసిన జట్టు కెప్టెన్ కోహ్లీ పేరిట రికార్డు ఉంది.

బౌలింగ్ విషయానికి వస్తే.. భువనేశ్వర్ కుమార్ రాయల్ ఛాలెంజర్స్‌పై హైదరాబాద్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్. కోహ్లీ జట్టుపై 14 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, హైదరాబాద్‌పై గరిష్టంగా 16మంది బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు పంపిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఉన్నాడు. స్పిన్ పిచ్‌లపై ఎవరి సత్తా ఏంటీ? అనేది ఇవాళ తేలనుంది.