IPL 2021- Ravindra Jadeja : బ్యాట్, బంతితో మాయ చేసిన జడ్డూ.. బెంగళూరుపై చెన్నై విజయం

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బెంగళూరకు చెక్ పెట్టేసింది. ఆదివారం మధ్యాహ్న పోరులో బెంగళూరు జట్టుపై చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2021- Ravindra Jadeja : బ్యాట్, బంతితో మాయ చేసిన జడ్డూ.. బెంగళూరుపై చెన్నై విజయం

Super Kings Won By 69 Runs In Ipl 2021

IPL 2021- Ravindra Jadeja : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బెంగళూరకు చెక్ పెట్టేసింది. ఆదివారం మధ్యాహ్న పోరులో బెంగళూరు జట్టుపై చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవింద్ర జడేజా సింగిల్ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడు. జడేజా (62 నాటౌట్‌; 28 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సులు) దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చెన్నైని ఒక్కడే విజయతీరాలకు చేర్చి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. టాస్ గెలిచి చెన్నై బ్యాటింగ్ ఎంచుకోగా.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది.

ప్రత్యర్థి జట్టు బెంగళూరు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఓపెనర్లలో రుతురాజ్ గైక్వాడ్ (33), డుప్లెసిస్ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సురేశ్ రైనా (24) పరిమితం కాగా.. అంబటి రాయుడు (14) పరుగులకే చేతులేత్తేశాడు. జడేజా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ జట్టుకు స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ధోనీ (2 నాటౌట్)గా నిలిచాడు. చెన్నై నిర్దేశించిన 192 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు జట్టును చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి బెంగళూరు 122 పరుగులకే చేతులేత్తేసింది.

దేవ్‌దత్‌ పడిక్కల్‌ (15 బంతుల్లో 4ఫోర్లు 2సిక్సులు) 34 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు సత్తా చాటలేకపోయింది. బ్యాట్‌ ఝుళిపించిన జడేజా.. బంతితోనూ మ్యాజిక్ చేశాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్‌ చేర్చి చెన్నై ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా బెంగళూరు కెప్టెన్ కోహ్లీ (8)కే పెవిలిన్ పంపింది. తర్వాతి ఓవర్లో షార్ట్‌పిచ్‌ బంతితో పడిక్కల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు శార్దూల్‌ చెక్ పెట్టేశాడు. ఆ తర్వాత జడేజా బంతితో మాయ చేశాడు. సుందర్‌ (7), మ్యాక్స్‌వెల్‌ (22), డివిలియర్స్‌ (4)ను జడ్డూ పెవిలియన్ పంపేశాడు. వరుస ఓవర్లలో మ్యాక్సీ, డివిలియర్స్‌ను బౌల్డ్‌ చేశాడు. క్రిస్టియన్‌ (1)ను రనౌట్‌ చేశాడు. స్పిన్నర్‌ తాహిర్‌ తన బౌలింగ్‌లో రాణించడమే కాకుండా అద్భుతమైన త్రోతో జేమీసన్‌ (16)ను రనౌట్‌ చేశాడు. చాహల్‌ (8 నాటౌట్‌), సిరాజ్‌ (12 నాటౌట్‌) మాత్రమే క్రీజులో నిలిచారు. జడేజా (3/13) మాయ చేసి బెంగళూరు ఆట కట్టించి చెన్నైను గెలిపించాడు.