RCB vs MI : బుమ్రా-కోహ్లీల మధ్య పోటీ.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు వేళాయే..

కాసేపట్లో ఐపీఎల్‌ 14వ సీజన్‌కు తెరలేవనుంది. డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. స్పోర్ట్‌ జర్నలిస్ట్‌ సంజనా గణేషన్‌ను పెళ్లి చేసుకున్న బుమ్రా నూతనోత్సాహంతో ఐపీఎల్‌కు సిద్ధమయ్యాడు.

RCB vs MI : బుమ్రా-కోహ్లీల మధ్య పోటీ.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు వేళాయే..

Virat Kohli Vs Jasprit Bumrah (1)

Virat Kohli vs Jasprit Bumrah : కాసేపట్లో ఐపీఎల్‌ 14వ సీజన్‌కు తెరలేవనుంది. డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. స్పోర్ట్‌ జర్నలిస్ట్‌ సంజనా గణేషన్‌ను పెళ్లి చేసుకున్న బుమ్రా నూతనోత్సాహంతో ఐపీఎల్‌కు సిద్ధమయ్యాడు. తొలి మ్యాచ్‌ ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌కు జరగనుంది. కోహ్లి, బుమ్రాల పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లి ఓపెనర్‌గా.. ముంబై ఇండియన్స్‌ తరపున ఓపెనింగ్‌ బౌలర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా మరోసారి ఎదురుపడితే చూడాలని ఉందని ఆకాశ్ చోప్రా చెప్పాడు.

బుమ్రా.. కోహ్లి వికెట్‌ తీస్తాడా.. కోహ్లి బుమ్రాపై బౌండరీల వర్షం కురిపిస్తాడా అనేది చూడాలి. కోహ్లి బ్యాటింగ్‌ దెబ్బతీయడానికి ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుమ్రాతో బౌన్సర్లు వేయించేందుకు సిద్ధంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. బుమ్రాకు ఐపీఎల్‌లో కోహ్లిపై అరుదైన రికార్డు ఉంది. బుమ్రాకు ఐపీఎల్‌లో మొయిడెన్‌ వికెట్‌ (2013 ఐపీఎల్‌) కోహ్లి రూపంలో వచ్చింది. ఐపీఎల్‌లో 100వ వికెట్‌ (2020 ఐపీఎల్‌)ను కూడా కోహ్లి రూపంలోనే వచ్చింది. బుమ్రా తన ఐపీఎల్‌ కెరీర్‌లో 92 మ్యాచ్‌లాడి 109 వికెట్లు తీశాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లి ఐపీఎల్‌లో 192 మ్యాచ్‌లాడి 5878 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా మధ్య పోటీపై ఆసక్తి నెలకొందని టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అన్నాడు. అత్యుత్తమ క్రికెటర్ల మధ్య పోరాటం వీక్షించేందుకు ఆసక్తిగా ఉందని అన్నాడు. గతంలో కోహ్లీపై బుమ్రా పైచేయి సాధించాడని తెలిపాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయితో బెంగళూరు తలపడనుంది. ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల మధ్య పోరే ఈ మ్యాచ్‌లో కీలకంగా మారనుంది. బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ, బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా.. ఇద్దరూ అత్యుత్తమ క్రికెటర్లే. కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

బుమ్రా పెళ్లి విరామం తీసుకొని వస్తున్నాడు. విరాట్‌ ఓపెనింగ్‌ చేస్తున్నాడు. విరాట్‌ బ్యాటింగ్‌కు రాగానే ముంబయి కెప్టెన్ రోహిత్‌ బంతిని బుమ్రాకు ఇస్తాడు. అతడు బౌన్సర్లు విసురుతాడు. ఎందుకంటే రెండు మూడుసార్లు పుల్‌షాట్లు ఆడబోయి విరాట్‌ ఔటయ్యాడు. బుమ్రాపై మాత్రం పుల్‌షాట్లు‌ ఆడేందుకు ప్రయత్నించాడు. చెత్త షాటుకు ఔటయ్యాడు. అందుకే వీరిద్దరి పోరు కోసం ఎదురు చూస్తున్నానని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.