Rivaba Jadeja : రవీంద్ర జడేజా భార్య ఎవరు? జీతమెంత? ఆస్తులెన్ని? సీఎస్‌కే ఆల్ రౌండర్ పర్సనల్ లైఫ్ గురించి అభిమానుల ఆరా

జడేజా మరోసారి న్యూస్ లో హెడ్ లైన్ గా మారాడు. అభిమానులు అతడి వ్యక్తిగత వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. రవీంద్ర జడేజా భార్య ఎవరు? అని తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. జడేజా పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీ గురించి తెలుసుకుని అభిమానులు వండర్ అయ్యారు.

Rivaba Jadeja : రవీంద్ర జడేజా భార్య ఎవరు? జీతమెంత? ఆస్తులెన్ని? సీఎస్‌కే ఆల్ రౌండర్ పర్సనల్ లైఫ్ గురించి అభిమానుల ఆరా

Ravindra Jadeja

Ravindra Jadeja : రవీంద్ర జడేజా.. క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. అటు టీమిండియాలో, ఇటు ఐపీఎల్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు.ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో మెరుపులు మెరిపించాడు. అందుకే జడేజాకి అంత ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఐపీఎల్ లో తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు రవీంద్ర జడేజా. అద్భుతమైన ఫీల్డింగ్ తో వారెవా అనిపించాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. మరోసారి తన బుల్లెట్ త్రోతో అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. పంజాబ్‌ కింగ్స్‌తో వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం(ఏప్రిల్ 16,2021) రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రవీంద్ర జడేజా అదరగొట్టేశాడు. ఈ మ్యాచ్ లో కళ్లుచెదిరే రనౌట్ చేయడమే కాదు స్టన్నింగ్ క్యాచ్ కూడా అందుకుని బెస్ట్ ఫీల్డర్ అనిపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుని ఐపీఎల్ 2021 సీజన్‌లో గెలుపు బోణి అందుకుంది.

ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన దీపక్ చహర్ బౌలింగ్‌లో క్రిస్‌గేల్ ఐదో బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి పాయింట్ దిశగా వెళ్లింది. దాంతో.. సింగిల్ కోసం నాన్‌ స్ట్రైక్ ఎండ్‌లోని కేఎల్ రాహుల్ పిలవగా.. తొలుత తటపటాయించిన క్రిస్‌గేల్.. ఆ వెంటనే పరుగు అందుకున్నాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా వేగంగా స్పందించి.. రెప్పపాటులో బంతిని నేరుగా వికెట్లపైకి విసిరాడు. దాంతో.. కేఎల్ రాహుల్ (5: 7 బంతుల్లో 1×4) రనౌట్‌గా వెనుదిరగక తప్పలేదు.

ఆ తర్వాత ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లోనూ దీపక్ చహర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా మరోసారి మెరుగైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఆ ఓవర్‌ రెండో బంతిని నకుల్ బాల్ రూపంలో దీపక్ చాహర్ సంధించగా.. క్రిస్‌గేల్ (10: 10 బంతుల్లో 2×4) డ్రైవ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. ఎడ్జ్ తాకిన బంతి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా కొద్దిగా గాల్లోకి లేచింది. అదే అదునుగా ముందుకు డైవ్ చేసిన జడేజా బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు.

జడేజా ఎంత మంచి ఫీల్డ‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న ఫీల్డింగ్‌తో అవ‌త‌లి జ‌ట్టుకు ప‌రుగులు రాకుండా ఎన్నోసార్లు నియంత్రించాడు. ఒంటి చేత్తో క్యాచ్‌లు అందుకోవ‌డంతో పాటు ఫీల్డింగ్‌లో త‌న మెరుపు విన్యాసాల‌తో ఆక‌ట్టుకుంటాడు. ఐపీఎల్ 2021లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న జడేజా ఒక కళ్లు చెదిరే క్యాచ్‌.. ఒక మెరుపు రనౌట్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఎప్పటిలానే అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో జడేజా మరోసారి న్యూస్ లో హెడ్ లైన్ గా మారాడు. అభిమానులు అతడి వ్యక్తిగత వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. రవీంద్ర జడేజా భార్య ఎవరు? అని తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. జడేజా పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీ గురించి తెలుసుకుని అభిమానులు వండర్ అయ్యారు.

జడేజా భార్య పేరు రివబా జడేజా(రివా సోలంకి). యాక్టివ్ పొలిటిషియన్. మెకానికల్ ఇంజీనిరింగ్ చదివారు. రాజ్ కోట్ లోని ఆత్మీయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఇంజినీరింగ్ చదివారు. క్షత్రియ కమ్యూనిటీకి చెందిన కర్ణి సేన మహిళా విభాగానికి గతేడాది చీఫ్ గా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నేత హరిసింగ్ సోలంకికి ఆమె మేనకోడలు అవుతారు.

ఓ పార్టీలో రివా సోలంకి, జడేజా కలిశారు. ఆ పార్టీలో చూపులు కలిశాయి. ఆ తర్వాత డేటింగ్ స్టార్ట్ చేశారు. జడేజా సోదరి నైనాకి రివా సోలంకి ఫ్రెండ్ కూడా. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత 2016 ఫిబ్రవరి 5న ఎంగేజ్ మెంట్ జరిగింది. రెండు నెలల తర్వాత ఏప్రిల్ 17న రాజ్ కోట్ లో సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. జడేజా దంపతులకు 2017లో పాప పుట్టింది. పేరు నిద్యాన. జడేజా దంపతులు సోషల్ మీడియాలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. వ్యక్తిగత వివరాలు పెద్దగా షేర్ చెయ్యరు. ఇంతవరకు తన కూతురి పిక్ ని జడేజా షేర్ చెయ్యకపోవడం విశేషం.

జడేజా సంపాదన:
జడేజా సంపాదన విషయానికి వస్తే (2021 ఏడాదికి)50కోట్లు. ఒక్క ఐపీఎల్ నుంచే 77కోట్లు సంపాదించాడు. బీసీసీఐ జాబితాలో గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ లో ఉన్నాడు. దీని ద్వారా అతడికి ఏడాదికి 5కోట్లు జీతంగా అందుతుంది. ఒక్క ప్రకటన కోసం జడేజా కోటి రూపాయలు తీసుకుంటాడని సమాచారం. గుజరాత్ టూరిజం, ఇన్ క్రెడిబుల్ ఇండియా, లైఫ్ ఓకే బ్రాండ్స్ తో ఒప్పందం ఉంది.

ఐపీఎల్ 2021 లో జడేజా జీతం:
జడేజా 2008లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజస్తాన్ రాయల్స్ తరుఫున ఆడాడు. నాడు జడేజా ధర 9.2 కోట్లు. 2012లో చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాడు. చెన్నైపై రెండేళ్ల సస్పెన్షన్ సమయంలో అతడు గుజరాత్ లయన్స్ కు ఆడాడు. 2014-16 మధ్య జడేజా జీతం 5.5కోట్లకు పడిపోయింది. 2018లో చెన్నై మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి జడేజా జీతం(ఏడాదికి) 7కోట్లుగా ఉంది. ఐపీఎల్ 2021 సీజన్ లో అతడి సాలరీ 7కోట్లు. జడేజా డిసెంబర్ 6న 1988లో జామ్ నగర్ లో జన్మించాడు.