లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

IPL 2020: ప్లే ఆఫ్ షెడ్యూల్ ఇదే.. ఉమెన్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

Published

on

Schedule For Knock-Out Matches: ఎడారి హీట్‌‌లో.. అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని మైదానాల్లో.. రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్‌ పోటీలు లీగ్ దశలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాయి. అలుపు లేకుండా బాదేవోడు ఒకడు.. బుల్లెట్లలా బంతులు విసిరేవాడొకడు.. బ్యాట్‌‌కు, బాల్‌‌కు మధ్య బ్యాలెన్స్‌‌ ఉండేలా రూపొందించిన పిచ్‌‌లపై యువకులు రాణిస్తున్నారు. దాదాపుగా ప్లే ఆఫ్‌కు వెళ్లే జట్లు ఏమిటనేవి ఇప్పటికే ఓ అంచనా వచ్చేసింది.ఇటువంటి సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్లేఆఫ్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుత సీజన్‌లో మ్యాచ్‌లు జరుగుతున్న మూడు స్టేడియాల్లో షార్జాను వదిలేసి, దుబాయ్, అబూదాబి స్టేడియాల్లో మాత్రమే ప్లే ఆఫ్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు ప్లే ఆఫ్‌కు వెళతాయి.


కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ ఆటగాళ్లు..


పాయింట్ల పట్టికలో టాప్ 1, 2 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ నవంబర్ 5న జరగబోతుంది. 6వ తేదీన టాప్ 3, 4 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తరువాత 8వ తేదీన క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్లు తలపడతాయి. అన్ని మ్యాచ్‌లు భారత సమయం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఆడతాయి.మార్చి లో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కరోనా కారణంగా వాయిదా పడి ప్రస్తుతం యూఏఈలో జరుగుతుంది. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఈ లీగ్ దశ కాగా.. పురుషుల ఐపీఎల్ 2020 చివర్లో అంటే నవంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నారు. లేటెస్ట్‌గా లీగ్ కోసం మహిళా ప్లేయర్స్ యూఏఈకి కూడా వెళ్లారు. వీరి లీగ్‌లో కేవలం మూడు జట్లగ 4 మ్యాచ్ లు ఆడుతాయి. అందువల్ల వీరిని పురుషుల జట్ల మాదిరిగా వివిధ వేదికలకు తిప్పకుండా కేవలం షార్జాలోనే మ్యాచ్‌లను నిర్వహించాలని భావించింది బీసీసీఐ.మహిళల టీ 20 సవాళ్లకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ విడుదల చేసింది. నవంబర్ 4, 5, 7 మరియు 9 తేదీల్లో షార్జాలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో సూపర్నోవాస్, ట్రైల్బ్లేజర్స్ మరియు వెలాసిటీ అనే మూడు జట్లు పాల్గొంటాయి. కెప్టెన్లుగా హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, మిథాలీ రాజ్ ఉన్నారు. భారత్‌తో పాటు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాల మహిళా క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు.ప్లేఆఫ్‌లు మరియు ఫైనల్స్ షెడ్యూల్ (అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు):
05 నవంబర్ 2020: క్వాలిఫైయర్ -1 (టీమ్ -1 వర్సెస్ టీమ్ -2), దుబాయ్
06 నవంబర్ 2020: ఎలిమినేటర్ (టీమ్ -3 వర్సెస్ టీమ్ -4), అబుదాబి
08 నవంబర్ 2020: క్వాలిఫైయర్ -2 (క్వాలిఫైయర్ -1 వర్సెస్ ఓడిపోయిన ఎలిమినేటర్), అబుదాబి
10 నవంబర్ 2020: ఫైనల్స్ (క్వాలిఫయర్స్ -1 మరియు 2 విజేతల మధ్య), దుబాయ్మహిళల టి 20 ఛాలెంజ్ షెడ్యూల్:
మొదటి మ్యాచ్, 04 నవంబర్ 2020: సూపర్నోవాస్ వర్సెస్ వెలాసిటీ, షార్జా (రాత్రి 7:30)
రెండవ మ్యాచ్, 05 నవంబర్ 2020: వాలోసిటీ vs ట్రైల్బ్లేజర్స్, షార్జా (మధ్యాహ్నం 3:30)
మూడవ మ్యాచ్, 07 నవంబర్ 2020: ట్రైల్బ్లేజర్స్ vs సూపర్నోవాస్, షార్జా (రాత్రి 7:30)
నాల్గవ మ్యాచ్, 09 నవంబర్ 2020: ఫైనల్, షార్జా (రాత్రి 7:30)

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *