గోవాలో భర్తేమో బెట్టింగులు.. హైదరాబాద్‌లో భార్య పైసా వసూళ్లు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

IPL gambling Case : క్రికెట్ బెట్టింగులు.. పైసా వసూళ్లు.. ఇదే కొన్నాళ్లుగా దంపతుల దందా నడిపిస్తున్నారు. గోవా, హైదరాబాద్ మధ్య బెట్టింగ్ వసూళ్లకు పాల్పడు తున్నారు. గోవాలో ఉండి భర్తేమో బెట్టింగులకు పాల్పడుతుంటే.. బెట్టింగ్ కట్టినవారి నుంచి డబ్బులను భార్య హైదరాబాద్ నుంచి వసూళ్లు చేస్తోంది. దంపతులు సుమన్లత, రాహుల్ సింగ్లను పశ్చిమమండలం టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు.బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుల్లో ఇప్పటి వరకు మగవారే ఉన్నారు. మహిళ పోలీసులకు బెట్టింగ్ వ్యవహారంలో పట్టుబడటం ఇదే మొదటి కేసు. మంగళ్హాట్ నివాసి ధరమ్సింగ్ లో బెట్టింగ్ పాల్పడితే పోలీసులకు అనుమానం వస్తుందనే భయంతో గోవాకు వెళ్లిపోయాడు. ఐపీఎల్ క్రికెట్ సీజన్ కావడంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.మేనల్లుడు రాహుల్ కు నెలకు రూ.20 వేలు జీతం ఇస్తానని చెప్పాడు. ఫోన్ ద్వారా బెట్టింగ్ కాసేవారి వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పాడు. పదిహేను సెల్‌ఫోన్ నంబర్లను రాహుల్ ఇవ్వగానే వారి పేర్లు నమోదు చేసుకున్నాడు.బెట్టింగ్ కాసిన వారి నుంచి ధరమ్సింగ్ భార్య సుమన్లత డబ్బులు వసూలు చేస్తోంది. వారి అడ్రస్ గుర్తించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం ధరమ్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. టీవీ, 15 మొబైల్ ఫోన్లు, రూ.27వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related Tags :

Related Posts :