ఐపిఎల్ 2020 మారుతుంది.. ఇంట్లో నుంచే కామెంటరీ!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనావైరస్ కారణంగా పని చేసే మార్గాలు మారుతున్నాయి. ఈ క్రమంలో ఆట తీరు కూడా మారుతోంది. రాబోవు కాలంలో ఇంకా పెద్ద మార్పులను చూసేందుకు సిద్ధం అవుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్ 2020) బ్రాడ్‌కాస్టర్లు ఇటీవల ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో విజయవంతంగా ప్రయోగాలు చేసిన తర్వాత ఐపిఎల్‌లో వర్చువల్ కామెంటరీని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు.

దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్‌లో బరోడాలోని తన ఇంటి నుంచి, కోల్‌కతాకు చెందిన డీప్ దాస్‌గుప్తా, ముంబై నివాసం నుంచి సంజయ్ మంజ్రేకర్ ఆడిన మ్యాచ్ గురించి ఇర్ఫాన్ పఠాన్ కామెంటరీ ఇచ్చారు. ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఇంటి నుంచి వందల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న మ్యాచ్ గురించి కామెంటరీ ఇచ్చిన అనుభవాన్ని వివరించాడు.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ప్రపంచం నిరంతరం కొత్త మార్పులు వైపు చూస్తుంది. ఈ క్రమంలోనే ఐపిఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సెంచూరియన్ పార్క్‌లో మూడు జట్ల మధ్య ఆడిన 36 ఓవర్ల మ్యాచ్‌లో ‘వర్చువల్ కామెంటరీ’ని ఉపయోగించింది. కామెంటేటర్ మాత్రమే కాదు, దానితో సంబంధం ఉన్న ఉద్యోగులు కూడా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి లాగిన్ అయ్యారు.

డైరెక్టర్ కూడా మైసూర్‌లో కూర్చుని అందరిపై నిఘా పెట్టారు. కొన్ని ప్రారంభ సమస్యలు తప్ప ఈ ప్రయోగం విజయవంతమైంది. హిందీ మరియు ఆంగ్ల కామెంట్రీ కాకపోయినా, తమిళం, తెలుగు, కన్నడ వంటి ప్రాంతీయ భాషలలో మాత్రం ప్రారంభించవచ్చు.

Related Posts