లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

IPL-2020

IPL 2020, MI vs RR Live: రాజస్థాన్‌పై ముంబై ఘన విజయం

Published

on

Picture

57పరుగుల తేడాతో ముంబై ఘన విజయం

06/10/2020,11:11PM

రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 57పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సొంతం చేసుకుంది. 194పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 136పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Picture

ఏడవ వికెట్‌గా తివాటియా.. 8వ వికెట్‌గా గోపాల్.. రాజస్థాన్ స్కోరు 115/8

06/10/2020,11:03PM

ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆల్మోస్ట్ ఓటమికి చేరువైంది. బూమ్రా వేసిన 16వ ఓవర్‌లో రెండవ బంతికి ఏడవ వికెట్‌గా తివాటియా.. 5వ బంతికి 8వ వికెట్‌గా గోపాల్ అవుట్ అయ్యారు.

Picture

ఆరు వికెట్లు అవుట్..

06/10/2020,10:47PM

బట్లర్ అవుట్ అయిన కాసేపటికే దూకుడుగా ఆడుతున్న టామ్ కర్రన్ అవుట్ అయ్యాడు. పోలార్డ్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టామ్ కర్రన్.. 16బంతుల్లో 15పరుగులు చేశాడు.

Picture

బట్లర్ అవుట్.. రాజస్థాన్ స్కోరు 98/5

06/10/2020,10:45PM

నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న రాజస్థాన్ జట్టును గట్టెక్కించేందుకు ఒంటరి పోరాటం చేసిన బట్లర్.. పాటిన్‌సన్ ఓవర్‌లో పోలార్డ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. 35బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసిన బట్లర్.. 44బంతుల్లో 70పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Picture

హాఫ్ సెంచరీ చేసిన బట్లర్.. ఒంటరి పోరాటం

06/10/2020,10:40PM

నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న రాజస్థాన్ జట్టును గట్టెక్కించేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నాడు బట్లర్.. ఈ క్రమంలోనే 50 పరుగులు పూర్తి చేశాడు. 35బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు బట్లర్.

Picture

పెవిలియన్ చేరిన లోమ్రోర్.. రాజస్థాన్ స్కోరు 63/4

06/10/2020,10:39PM

మూడు వికెట్లు పడిపోయిన తర్వాత కష్టాల్లో పడిన రాజస్థాన్ జట్టును గట్టెక్కించే ప్రయత్నంలో ఆచితూచి ఆడుతున్న లోమ్రోర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో అనుకూల్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సబ్ ఫీల్డ్ చేస్తున్న అనుకూల్ రాయ్.. క్యాచ్ అధ్భుతంగా పట్టుకోగా.. లోమ్రోర్ పెవిలియన్ చేరాడు. లోమ్రోర్ 13బంతుల్లో 11పరుగులు చేశాడు.

Picture

ఆరు ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 31/3

06/10/2020,10:04PM

మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ కష్టాల్లో ఉండగా.. కీపర్ జో్స్ బట్లర్, యువ ఆటగాడు లోమ్రోర్ పరుగులు రాబట్టి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. లోమ్రోర్ 9బంతుల్లో 9పరుగులు చెయ్యగా.. బట్లర్ 15బంతుల్లో 16పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 3వికెట్లు నష్టానికి 31పరుగులకు చేరుకుంది.

Picture

మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్

06/10/2020,9:58PM

ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో 194పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ మూడు ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లు యశస్వి జైశ్వాల్ పరుగులేమీ చెయ్యకుండానే బౌల్ట్ బౌలింగ్‌లో అవుట్ అవగా.. స్మిత్ 7బంతుల్లో 6పరుగులు చేసి బూమ్రా బౌలింగ్‌లో డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత సంజుశాంసన్ కూడా మూడు బంతుల్లో పరుగులేమీ చెయ్యకుండా బౌల్ట్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లోమ్రోర్, బట్లర్ ఉన్నారు.

Picture

రాజస్థాన్ టార్గెట్ 194

06/10/2020,9:31PM

రాజస్థాన్ టార్గెట్ 194గా ఫిక్స్ చేసింది ముంబై ఇండియన్స్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20ఓవర్లలో 193పరుగులు చేసింది.

Picture

19ఓవర్లకు ముంబై స్కోరు 176

06/10/2020,9:22PM

19ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 176పరుగులకు చేరుకుంది. ప్రస్తుతం క్రీజులో హార్ధిక్ పాండ్యా, యాదవ్ ఉన్నారు.

Picture

18ఓవర్లకు ముంబై స్కోరు 161

06/10/2020,9:10PM

18ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 4వికెట్లు కోల్పోయి 161పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హార్ధిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ ఉన్నారరు.

Picture

నాల్గవ వికెట్‌గా క్రునాల్ పాండ్యా.. స్కోరు 122/4

06/10/2020,8:55PM

ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్‌గా క్రునాల్ పాండ్యా వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో శ్రీయాస్ గోపాల్‌కు క్యాచ్ ఇచ్చి పాండ్యా అవుట్ అయ్యాడు. పాండ్యా 17బంతుల్లో 12పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Picture

10ఓవర్లకు ముంబై స్కోరు 90/3

06/10/2020,8:32PM

దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ముంబై మూడు వికెట్లు కోల్పోగా.. 10ఓవర్లకు 90పరుగుల స్కోరు చేసింది.

Picture

వెంటవెంటనే రెండు వికెట్లు.. ముంబై స్కోరు 88/3

06/10/2020,8:30PM

10వ ఓవర్‌లో రాజస్థాన్ బౌలర్ శ్రీయాస్ గోపాల్ రెండు వరుస బంతుల్లో ముంబైకి చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లను అవుట్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పక్క పక్క బంతుల్లో అవుట్ అయ్యారు. ముంబై స్కోరు మూడు వికెట్ల నష్టానికి 88గా ఉంది. 

Picture

8ఓవర్లకు ముంబై స్కోరు 76/1

06/10/2020,8:17PM

8ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 76కి చేరుకుంది. ఒక వికెట్ నష్టపోగా.. ప్రస్తుతం రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు.

Picture

7ఓవర్లకు ముంబై స్కోరు 65/1

06/10/2020,8:13PM

డికాక్ అవుట్ అయిన తర్వాత ముంబై స్కోరు బోర్డు నెమ్మదిగా వెళ్తుంది. ఈ క్రమంలోనే 7ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 65పరుగులు చేసింది.

Picture

ఫస్ట్ వికెట్‌గా డీకాక్.. ముంబై స్కోరు 49/1

06/10/2020,7:59PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై అధ్భుతమైన ఓపెనింగ్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ స్కోరును పరుగులు పెట్టించగా.. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో 15బంతుల్లో 23పరుగులు చేసిన డికాక్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Picture

Rajasthan Royals (Playing XI):

06/10/2020,7:13PM

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజు శాంసన్, మహిపాల్ లోమోర్, రాహుల్ తివాటియా, టామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగి.

Picture

Mumbai Indians (Playing XI):

06/10/2020,7:10PM

రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Picture

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. బ్యాటింగ్

06/10/2020,7:08PM

రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబైని బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Picture

రాజస్థాన్ జట్టులో మార్పులు ఉంటాయా?

06/10/2020,6:56PM

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నేటి మ్యాచ్ కోసం జట్టును మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ మీద చాలా ఆశలు పెట్టుకుంది. అయితే, బట్లర్ గత మూడు మ్యాచ్‌ల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాదు జట్టుకు పెద్ద ఆరంభం ఇవ్వడంలో విఫలం అయ్యాడు.

అలాగే అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్పా నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. అతని ఫామ్ ఆందోళన కలిగించే విషయం. యువ బ్యాట్స్‌మన్ ర్యాన్ పరాగ్ బ్యాటింగ్ కూడా అంతంత మాత్రమే. అటువంటి పరిస్థితిలో, స్మిత్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వవచ్చునని అంటున్నారు. జైస్వాల్ బట్లర్‌తో ఓపెనింగ్‌కు దిగవచ్చు. జట్టును బలోపేతం చేయడానికి స్మిత్ స్వయంగా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావచ్చు.

డెత్ ఓవర్లలో రాజస్థాన్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తుండగా.. జయదేవ్ ఉనద్కత్ నాలుగు మ్యాచ్‌లలో ఒక వికెట్ మాత్రమే తియ్యగా.. అతని ఫామ్ కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఇది టామ్ కురెన్ మరియు జోఫ్రా ఆర్చర్‌లపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిస్థితులలో స్మిత్.. వరుణ్ ఆరోన్ లేదా కార్తీక్ త్యాగిలకు అవకాశం ఇవ్వవచ్చు.

Picture

సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్న రాజస్థాన్:

06/10/2020,6:50PM

షార్జాలో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 34 పరుగుల తేడాతో ఓడించగా.. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు రాజస్థాన్ రాయల్స్‌ కంటే బలంగా కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల పరాజయాన్ని చవిచూసింది. ముంబైపై గెలిచి తిరిగి సత్తా చాటుకోవాలని రాజస్థాన్ జట్టు భావిస్తుంది.

Picture

ముందంజలో ముంబై..

06/10/2020,6:49PM

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో మూడు గెలవగా, రాజస్థాన్ రాయల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచింది.

Picture

IPL 2020, ముంబై vs రాజస్థాన్:

06/10/2020,6:48PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2020లో 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI) జట్టు.. రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతుంది.